/rtv/media/media_files/2024/12/01/9JTxk3WryLfrfSjKY8Cm.jpg)
న్యాచురల్ స్టార్ నాని హీరోగా 'ప్యారడైజ్' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 'దసరా' తో భారీ సక్సెస్ అందుకున్న ఈ కాంబోలో తెరకెక్కనున్న రెండో సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. డైరెక్టర్ శ్రీకాంత్ ఈసారి నాని కోసం సికింద్రాబాద్ నేపథ్యంలో సాగే ఓ పీరియాడిక్ కథని సిద్ధం చేశారు.
నానికి తండ్రిగా చిరు..
ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ నెట్టింట హల్చల్ చేస్తోంది. అదేంటంటే.. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కూడా భాగం కానున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఇటీవల ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్ కోసం మెగాస్టార్ ను కలిసి ఆయనకి స్టోరీ వినిపించగా.. కథ నచ్చి చిరు ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read : 'పీలింగ్స్' సాంగ్ వచ్చేసింది.. ఎనర్జిటిక్ స్టెప్పులతో దుమ్ములేపిన బన్నీ
అంతేకాదు నానికి తండ్రిగా కనిపిస్తారని, అలాగే ఈ పాత్ర ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలలో దాదాపుగా 20 నిమిషాలు ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఇదే నిజమైతే మెగాస్టార్ ఎంట్రీతో ఈ సినిమాకి నెక్స్ట్ లెవెల్ హైప్ రావడం గ్యారెంటీ అని చెప్పొచ్చు. మరి ఇందులో నిజం ఎంతుందో తెలియాలంటే దీనిపై పూర్తి స్పష్టత వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే.
YES.#THEPARADISE
— Nani (@NameisNani) November 6, 2024
A Srikanth Odela Film. pic.twitter.com/wnBPrVrlMG
పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో నాని సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తుండగా.. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. 2025 చివర్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.