Hindupuram : అత్తా కోడళ్ల అత్యాచారం కేసు..ఇద్దరు నిందితుల అరెస్ట్‌!

చిలమత్తూరు మండలంలో శుక్రవారం జరిగిన అత్తాకోడళ్ల అత్యాచారం కేసులో ఇద్దరు నిందితుల్ని పోలీసులు పట్టుకున్నారు. దుండగులు మహిళల భర్తల్ని కత్తులతో బెదిరించి ఈ దారుణానికి పాల్పడ్డారు.

pharmacy student was gang raped in Warangal
New Update

Ap Crime : పొట్టకూటి కోసం వచ్చిన వలస వచ్చిన ఆ కుటుంబం పై గంజాయి మత్తులో ఉన్న మృగాలు దాడి చేశాయి. నిర్మాణంలో ఉన్న పేపర్‌ మిల్లులో పనిచేస్తున్న వాచ్‌మన్‌ కుటుంబంలోని అత్తాకోడళ్ల పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాయి. శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో శుక్రవారంఈ దారుణం జరిగింది.. కర్ణాటకలోని బళ్లారికి చెందిన ఓ  వ్యక్తి ఐదు నెలల క్రితం చిలమత్తూరు మండలంలో పొలాల వద్ద నిర్మాణంలో ఉన్న పేపర్‌ మిల్లులో వాచ్‌మన్‌గా ఉద్యోగంలో చేరాడు.

Also Read:  ట్రంప్‌ ర్యాలీకి సమీపంలో తుపాకీతో వ్యక్తి హల్‌చల్‌

ఆ పక్కనే ఉన్న రేకుల షెడ్డులో ఆయనతోపాటు భార్య, కుమారుడు, కోడలు నివసిస్తున్నారు. శుక్రవారం రాత్రి 2 గంటల సమయంలో మూడు ద్విచక్రవాహనాలపై ఆరుగురు దుండగులు ఆ భవనం వద్దకు వచ్చి వాచ్‌మన్‌ను తాగడానికి నీరు అడిగారు. తొట్డెలో ఉన్నాయని చెప్పడంతో వాచ్‌మన్‌ కుటుంబం నివసిస్తున్న రేకుల షెడ్డువైపు వెళ్లారు. సీసీ కెమేరాలున్నాయని వాచ్‌మన్‌ చెప్పడంతో దుండగులు వాటిని పగుల కొట్టారు. ఆ అలికిడికి వాచ్‌మెన్‌ భార్య, కుమారుడు, కోడలు బయటికి వచ్చారు.

Also Read: గాజాలోని పాఠశాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. 20 మంది మృతి..

దుండగులు ఆ ఇద్దరు మహిళలపై అఘాయిత్యానికి ప్రయత్నించగా వాచ్‌మన్‌, అతని కుమారుడు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారిని తోసేయడంతో పాటు,  వారిపై దాడి చేశారు. అక్కడున్న కత్తి తో బెదిరించడంతో తండ్రీకొడుకు నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. దుండగులు ఆ ఇద్దరినీ బయటికి గెంటేసి, అత్తాకోడలిని రెండు వేర్వేరు షెడ్లలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఏడాదిన్నర వయసున్న చిన్నారి ఏడుస్తున్నప్పటికీ వారు కనికరించలేదు. 

Also Read: తెలంగాణ విద్యార్థి హత్య కేసు.. నిందితునికి 60 ఏళ్ల శిక్ష

గంటన్నరపాటు అక్కడే ఉన్న దుండగులు తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. వాచ్‌మన్‌ కుమారుడు సమీపంలోని గ్రామానికి వెళ్లి ఆ గ్రామస్థుల ఫోన్‌ ద్వారా పరిశ్రమ యజమానికి జరిగిన విషయం గురించి చెప్పగా, ఆయన పోలీసులకు చెప్పారు. జిల్లా ఎస్పీ రత్న శనివారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకుని ఆరాతీశారు. బాధిత మహిళలను ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

24 గంటల్లోనే అదుపులోకి నిందితులు?

అత్యాచారం జరిగిన 24 గంటల్లోనే పోలీసులు కేసును ఛేదించారు. దుండగులను పట్టుకునేందుకు ఎస్పీ నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రానికే నిందితుల్లో ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. నిందితుల్లో ముగ్గురు పాత నేరస్థులు కాగా, వారిలో ఒకరు అంతర్రాష్ట్ర మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నిందితుల్లో ముగ్గురు మైనర్లు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read:  ఏపీలో అలర్ట్.. ఈ జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు!

#rape-case #hindupuram
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe