Israel: గాజాలోని పాఠశాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. 20 మంది మృతి..

సెంట్రల్​ గాజాలోని ఓ పాఠశాలపై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో చిన్నారులు తో పాటు 20 మంది మృతి చెందారు. అదే రోజు రాత్రి జరిగిన మరో దాడిలో నుసిరత్​లోని ఇద్దరు మహిళలు చనిపోయారు.

New Update
iran warns israel

పశ్చిమాసియాలో రోజురోజుకి యుద్దం తీవ్రతరం అవుతోంది. 'ఆదివారం రాత్రి సెంట్రల్​ గాజాలోని ఓ పాఠశాలపై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో చిన్నారులు తో పాటు 20 మంది మృతి చెందారు. అదే రోజు రాత్రి జరిగిన మరో దాడిలో నుసిరత్​లోని ఇద్దరు మహిళలు చనిపోయారు. ఏడాదిగా జరుగుతున్న యుద్ధం వల్ల నిరాశ్రయులైన అనేక మంది పాలస్తీనియన్లకు ఆశ్రయం కల్పించడం కోసం ఈ పాఠశాలను ఓ శరణార్థి శిబిరంగా మార్చరు.

Also Read: రాజమౌళి, రానా విలన్ కాంబో మళ్లీ రిపీట్ కానుందా?

 కానీ ఈ పాఠశాలపైనే ఇజ్రాయెల్ దాడికి పాల్పడింది' అని స్థానిక ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. ఈ దాడిలో చనిపోయినవారి మృతదేహాలను నుసైరత్​లోని అల్​-అవ్దా ఆసుపత్రికి, డీర్​ అల్​ బలాహ్​లోని అల్​-అక్సా ఆసుపత్రికి తరలించామని అధికారులు తెలిపారు.

హెజ్​బొల్లా డ్రోన్​ దాడి

ఓవైపు ఇజ్రాయెల్ సెంట్రల్​ గాజాపై వైమానిక దాడి చేయగా, మరోవైపు సెంట్రల్ ఇజ్రాయెల్​లోని ఆర్మీ బేస్​ను టార్గెట్ చేసుకుని హెజ్​బొల్లా డ్రోన్​ దాడి చేసింది. ఈ దాడిలో తమ సైనికులు నలుగురు మరణించారని, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.

Also Read: ట్రంప్‌ ర్యాలీకి సమీపంలో తుపాకీతో వ్యక్తి హల్‌చల్‌

అమెరికా 'థాడ్​'

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ అయిన 'థాడ్‌'ను తమ మిత్రదేశం ఇజ్రాయెల్‌కు సరఫరా చేయాలని నిర్ణయించింది. థాడ్ వ్యవస్థను ఆపరేట్ చేయడానికి అమెరికా తన సైనికులను కూడా ఇజ్రాయెల్‌కు తరలించనుందని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. 

Also Read: Hyderabad - Vijayawada Highway పై కిలోమీటర్ల మేర బారులు తీరిన వాహనాలు

ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు థాడ్‌ సాయపడుతుందని పెంటగాన్ పేర్కొంది. అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాల మేరకు ఇజ్రాయెల్‌లో ఈ థాడ్​ వ్యవస్థను మోహరించేందుకు రక్షణశాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్ అనుమతి ఇచ్చారని తెలిపింది. ఈ అమెరికా నిర్ణయంపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ప్రత్యక్షంగా గానీ లేదా పరోక్షంగా గానీ ఇజ్రాయెల్‌కు సాయం చేస్తే, అది ఇరాన్‌పై దాడికి పాల్పడినట్లేనని హెచ్చరికలు జారీ చేసింది.

Also Read: మూసీలో కూల్చివేతలు...రేపటి నుంచే!

Advertisment
Advertisment
తాజా కథనాలు