Ap Rains:బంగాళాఖాతంలో నేడు తీవ్ర అల్పపీడనం..ఆ జిల్లాల్లో భారీ వర్షాలు!

ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం తెల్లవారుజామున అల్పపీడనం ఏర్పడింది. ఇది మంగళవారం నాటికి తీవ్ర అల్పపీడనం గా మారనుందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Telangana : బంగాళాఖాతంలో వాయుగుండం...తెలంగాణ పై ఎంత ప్రభావం అంటే!
New Update

Ap Rains: ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం తెల్లవారుజామున అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ మంగళవారం నాటికి తీవ్ర అల్పపీడనం గా బలపడనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆ తరువాత 48 గంటల్లో మరింత బలపడి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌ లోని దక్షిణ కోస్తా తీరాల వైపు కదులుతుందని వాతావరణశాఖ వెల్లడించింది.

Also Read: అబ్దుల్ కలాం తిరుపతికి వచ్చినప్పుడు ఏం చేశారో తెలుసా..ఇంకా మర్చిపోని శ్రీవారి భక్తులు!

దీని ప్రభావంతో గురువారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకులు స్టెల్లా తెలిపారు. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడతాయి.

Also Read: ఆరుగురు భారత దౌత్యవేత్తలను బహిష్కరించిన కెనడా

బుధవారం రెండు, మూడు చోట్ల అత్యంత భారీ వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తీరప్రాంత జిల్లాల్లో గంటకు గరిష్ఠంగా 55 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని అని అధికారులు వివరించారు. గురువారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని , ఇప్పటికే సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు ఒడ్డుకు తిరిగి రావాలని సూచించారు. విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం, అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది.

భారీ నుంచి అతి భారీ ...


అల్పపీడనం ప్రభావం వల్ల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణింకి కూర్మనాథ్‌ అన్నారు. బుధవారం రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

నైరుతి తిరోగమనం...


మహరాష్ట్ర,గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గడ్‌, ఒడిశా,అస్సాం, మేఘాలయ, అరుణాచల్‌ , మణిపూర్‌, మిజోరం, త్రిపుర, నాగాలాండ్‌ తో పాటు ఉత్తర బంగాళాఖాతం నుంచి నైరుతి రుతుపవనాలు వైదొలుగుతున్నాయి. రాబోయే రెండు రోజుల్లో ఏపీతో పాటు దేశంలోని పలు ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించేందుకు అనుకూలంగా ఉన్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

Also Read: ఓటీటీలో అదరగొడుతున్న సాయి ధరమ్ తేజ్ హీరోయిన్ 'ఉత్సవం'

ఈ క్రమంలో ఈశాన్య రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. వీటి ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాలతో పాటు మధ్య బంగాళాఖాతంలో వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read: దీపావళికి మీ ఇంట్లో ఈ మొక్కలను నాటండి... అన్ని సుఖ సంతోషాలే!

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe