దీపావళికి మీ ఇంట్లో ఈ మొక్కలను నాటండి... అన్ని సుఖ సంతోషాలే!

దీపావళి పండగ సందర్భంగా ఈ మొక్కలను నాటడం ద్వారా ఇంట్లో ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. శాంతి కలువ, వెదురు మొక్క, మనీ ప్లాంట్ వంటి మొక్కలను నాటడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.

New Update
11

Plants For Deepawali: 

దీపావళి, హిందువుల అతిపెద్ద, పవిత్రమైన పండుగ,  ఈ పర్వదినాన, దీపాలు వెలిగించి, శ్రీ లక్ష్మీ-గణేశుని,  సంపదకు రాజు అయిన కుబేరుని పూజించడం ద్వారా ఆనందం,  శ్రేయస్సును కోరుకుంటారు. ఈ పవిత్ర పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లను పూలతో, దీపాలతో, దీపాలతో, ఇతర వస్తువులతో అలంకరించి లక్ష్మీదేవికి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతారు. అయితే, ఇవన్నీ కాకుండా, దీపావళి రోజున  కొన్ని మొక్కలను నాటడం ద్వారా  ఇంట్లో సానుకూలత, ఆనందం , శ్రేయస్సును లభిస్తాయని నమ్ముతారు.  

జాడే మొక్క

జాడే మొక్కను క్రాసులా అని కూడా అంటారు. తెలుపు లేదా గులాబీ పువ్వులతో ఈ మొక్క చాలా అందంగా కనిపిస్తుంది. దీన్ని ఇంట్లో నాటడం వల్ల ఇంటి అందం పెరగడమే కాకుండా వాస్తు శాస్త్రం ప్రకారం ఇది చాలా అదృష్ట మొక్క అని కూడా చెబుతారు.  

శాంతి కలువ

తెల్లని పువ్వులతో కూడిన ఈ మొక్క దాని పేరు వలే   చాలా అందంగా కనిపిస్తుంది.  అంతే కాదు దాన్ని  నాటిన ప్రదేశం వాతావరణం  కూడా పూర్తిగా సానుకూలంగా మారుతుంది. శాంతికి చిహ్నమైన ఈ మొక్కను ఇంట్లో నాటితే సంతోషం, ఐశ్వర్యం కలుగుతాయి.

మనీ ప్లాంట్

మనీ ప్లాంట్ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.  దీపావళికి ఇంట్లో మనీ ప్లాంట్ తప్పకుండా నాటాలి.ఈ మొక్క గాలిలోని మలినాలను  తొలగిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో మనీ ప్లాంట్ పెడితే ఇంట్లో డబ్బుకు లోటు ఉండదని నమ్మకం.

వెదురు మొక్క
 

ఈ ప్లాంట్  ఎయిర్ ప్యూరిఫైయర్‌గా పనిచేస్తుంది. ఈ మొక్క నుంచి వెలువడే పాజిటివ్ ఎనర్జీ మనసును ప్రశాంతపరుస్తుంది. ఈ మొక్కను ఇంట్లో నాటడం కూడా వాస్తు శాస్త్రం ప్రకారం చాలా శుభప్రదంగా   పరిగణించబడుతుంది.

Also Read: Bengaluru: దర్శన్ బెయిల్‌ను మళ్ళీ కొట్టేసిన బెంగళూరు కోర్టు

Advertisment
Advertisment
తాజా కథనాలు