Vangalapudi Anita: జగన్ ఏం చేశారో చెప్పాలి.. హోంమంత్రి అనిత ఫైర్!
పోలీసు శాఖకు జగన్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు హోంమంత్రి అనిత. గత జగన్ ప్రభుత్వంలో, పోలీసు వాహనాలు కొని వాటికి డబ్బు కట్టనందుకు, మహీంద్రా కంపెనీ వాళ్ళు ఏపి పోలీసులను బ్లాక్ లిస్టులో పెట్టారని చెప్పారు. మేము వచ్చిన తరువాత, అవి కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.