Balineni Srinivasa Reddy: వైసీపీ కి రాజీనామా చేసి జనసేనలో చేరేందుకు సిద్దమైన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కి కూటమి నేతలు షాక్ ఇచ్చారు. అతని చేరికను స్థానిక నేతలు వ్యతిరేకిస్తున్నారు. నిన్నటి వరకు ప్రత్యర్థిగా ఉండి… తమ పై కేసులు పెట్టిన వారిని కూటమిలోకి రావడాన్ని స్వాగతించబోమని స్పష్టం చేశారు. బాలినేని జనసేన లోకి రావడం టీడీపీకే కాదు జనసేన పార్టీలో ఉన్న నాయకులకు ఇబ్బందే అని అన్నారు.
బాలినేని శ్రీనివాస రెడ్డి వలన ప్రతి టీడీపీ కార్యకర్త ఇబ్బంది పడింది వాస్తవం అని ఆవేదన వ్యక్తం చేశారు. బాలినేని జనసేన పార్టీ లోకి రా వ డం వ ల న టీడీపీ కి వచ్చే నష్టం ఏమి లేదు.. రాదు అని అన్నారు. బాలినేని తో కలిసి పనిచేయాల్సి వస్తె పార్టీ ఆదేశాలు..అధిష్టానం సూచన మేర ముందుకెళ్తాం అని పేర్కొన్నారు. కాగా ఈరోజు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో బాలినేని భేటీ అయ్యారు. చేరికపై ఆయన పవన్ తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే కూడా…
జగన్ కు షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను. వైసీపీ కి రాజీనామా చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 22న పవన్ కళ్యాణ్ సమక్షం లో జనసేన చేరనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే తన అనుచరులకు పార్టీ మార్పుపై సమాచారం ఇచ్చారు. ఆర్టీవీ తో అయన ఎక్సక్లూజివ్ గా మాట్లాడుతూ.. తాను పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. జనసేన లో చేరాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. రేపు జగ్గయ్యపేట లో నియోజకవర్గ కార్యకర్తల తో సమావేశం కానున్నట్లు తెలిపారు. తన అనుచరులు కూడా జనసేనలో చేరనున్నట్లు పేర్కొన్నారు. కాగా అదే రోజు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కూడా జనసేన కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.