Google in Andhra Pradesh: ఏపీకి గుడ్ న్యూస్.. గూగుల్ వచ్చేస్తోంది..!

అమరావతి రాజధాని నిర్మాణానికి పూనుకున్న చంద్రబాబు ప్రభుత్వం రాజధానికి అని హంగులను సమకూర్చుకుంటోంది. అందులో భాగంగా ప్రపంచ దిగ్గజ సంస్థ గూగుల్‌ను ఏపీలో ఏర్పాటు చేయడానికి సిద్దమైంది.143 ఎకరాల్లో గూగుల్‌ ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేస్తున్నారు.

New Update
google layoffs 2025

Google in Andhra Pradesh

Google in Andhra Pradesh:

అమరావతి రాజధాని(Amaravati Capital) నిర్మాణానికి పూనుకున్న చంద్రబాబు(CM Chandrababu) ప్రభుత్వం రాజధానికి అని హంగులను సమకూర్చుకుంటోంది. అందులో భాగంగా ప్రపంచ దిగ్గజ సంస్థ గూగుల్‌ను ఏపీ(AP News)లో ఏర్పాటు చేయడానికి సిద్దమైంది.143 ఎకరాల్లో గూగుల్‌ ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేస్తున్నారు.  గతంలోనే రాష్ట్ర ప్రభుత్వంతో ఉన్నత స్థాయిలో గూగుల్‌ ప్రతినిధుల చర్చించారు. నిన్న అనంతవరం, నెక్కల్లు మధ్య సమీపంలోని ఈ-8 రోడ్డు పక్కన సర్వేనంబర్లు 10, 12, 13, 15, 16లో సుమారు 143 ఎకరాల భూమి పరిశీలించారు. ఆ స్థలాన్ని గూగుల్‌కు కేటాయించేందుకు సిఆర్‌డిఎ(CRDA) ముందుకు వచ్చింది.

Also Read: ఈ నెలలోనే మంత్రివర్గ విస్తరణ.. పీసీసీ చీఫ్ మహేష్ సంచలన ప్రకటన!

ఈ క్రమంలో ఆ సంస్థ ప్రతినిధులు, సీఆర్డీఏ అధికారులతో కలసి శుక్రవారం నెక్కల్లులో స్థలాన్ని పరిశీలించారు. ఇక్కడికి సమీపంలో విమానాశ్రయం, రైల్వేస్టేషన్‌ కూడా రానుండడంతో సంస్థ ప్రతినిధులు ఈ స్థలం వైపే మొగ్గు చూపారని తెలుస్తోంది. (Google Site Survey AP)గూగుల్ సంస్థను ఇక్కడ నెలకొల్పితే పారిశ్రామికంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: వాయు కాలుష్యంతో అనేక ప్రమాదాలు.. తెలుసుకుంటే షాక్ అవుతారు

Advertisment
Advertisment
తాజా కథనాలు