AP Crime: ఏపీలో దారుణం.. తల్లీ, కూతురు దారుణ హత్య

కడప జిల్లా తొండూరు మండలం తుమ్మలపల్లిలో మద్యం మత్తులో భార్య, కూతురిని కొడవలితో నరికి గంగాధర్‌రెడ్డి హతమార్చాడు. తీవ్ర గాయాలతో భార్య శ్రీలక్ష్మి, కుమార్తె గంగోత్రి మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

New Update
kadapa murder

kadapa murder Photograph

AP Crime:  ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కడప జిల్లాలో మద్యం మత్తులో తల్లీ కూతుర్ని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన పులివెందల నియోజకవర్గంలో కలకలం రేపుతోంది. వివరలోకి వెళ్తే.. తొండూరు మండలం తుమ్మలపల్లిలో గంగాధర్‌రెడ్డి.. భార్య, కూతురు నివాసం ఉంటున్నారు. అయితే సోమవారం రాత్రి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. గంగాధర్‌రెడ్డి ఫుల్ల్‌గా తాగి ఇంటికి వచ్చాడు. అనంతరం భార్య శ్రీలక్ష్మీ, కుమార్తె గంగోత్రిని కొడవలితో నరికి చంపాడు. 

 ఇది కూడా చదవండి:  డ్రై ఫ్రూట్స్‌లో పాలు కలిపి తాగడం వల్ల హాని కలుగుతుందా?

కొడవలితో నరికి చంపాడు:

తర్వాత  అతను పారిపోయాడు. స్థానికులు శ్రీలక్ష్మీ, గంగోత్రి మృతి చెందిన విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. అనంతరం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. తీవ్ర గాయాలతో మృతి చెందిన తల్లీ కూతుర్ల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారైన నిందితుడు కోసం గాలిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. భార్యాభర్తలకు ఏమైనా గోడలున్నాయా..? ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.  

ఇది కూడా చదవండి: బాగా తుమ్ములు వస్తే ఈ ఇంటి చిట్కాలు పాటించండి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు