వీధిన పడ్డ ఉద్యోగులు.. రెచ్చిపోయిన సోమిరెడ్డి..!

టీడీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి కృష్ణపట్నం పోర్టు సెక్యూరిటీ గార్డులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాను సెక్యూరిటీ గార్డు లోపలికి అనుమతించకపోవడంతో వారి మీద సీరియస్ అయ్యి దాడి చేశారు.

MLA Somi reddy
New Update

టీడీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి కృష్ణపట్నం పోర్టు సెక్యూరిటీ గార్డులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బందిని నెట్టేసి చేయి చేసుకున్నంత వరకు తీసుకొచ్చారు. కృష్ణ పట్నం పోర్టులో కొన్ని రోజులుగా కంటైనర్ టెర్మినల్ పనులు నిలిచిపోయాయి. వీధిన పడ్డ ఉద్యోగుల కోసం సీఈవోతో మాట్లాడేందుకు టీడీపీ, బీజేపీ,జనసేన, సీపీఎం పార్టీల నేతలు పోర్టుకు వెళ్లారు. ఈ సందర్భంగా పోర్టు సిబ్బంది మీడియాను అడ్డుకున్నారు. 

ఇది కూడా చూడండి: ధంతేరాస్ స్పెషల్.. 10 నిమిషాల్లో బంగారం, వెండి డెలివరీ

మీడియాను అనుమతించాలని సెక్యూరిటీ సిబ్బందిని..

ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాను అనుమతించాలని సెక్యూరిటీ సిబ్బందికి తెలిపారు. పది వేల మంది కార్మికుల ఉద్యోగాలు పోయాయని, వేలాది ఎకరాల భూమిని పోర్టు కోసం ప్రజలు ఇచ్చారని, ఇప్పుడు కంటైనర్‌ పోర్టును చెన్నైకి తీసుకువెళితే చూస్తూ ఊరుకోమన్నారు. కేవలం రైతులు, కార్మికులు, స్థానికులు ప్రయోజనాల కోసమే ఈ పోరాటం చేస్తున్నామని తెలిపారు. 

ఇది కూడా చూడండి: చైనాలో వేలాది స్కూల్స్ మూసివేత.. ఎందుకో తెలిస్తే షాక్

ఎమ్మెల్యే చెప్పినప్పటికీ సెక్యూరిటీ సిబ్బంది వినిపించుకోకపోవడంతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. కోపంతో కొట్టేంత పనిచేశారు. నెల్లూరులో కృష్ణపట్నం టెర్మినల్ తరలింపుకు వ్యతిరేకంగా జరిగే పోరాటానికి అన్ని పార్టీలు మద్దతుతో పోరాడుతామన్నారు.  ఈ క్రమంలో కృష్ణపట్నం పోర్టు వద్ద ఆయన నిరసన తెలిపారు. అలాగే అఖిలపక్ష నేతలతో కలిసి పోర్టు సీఈవోను కూడా సోమిరెడ్డి నిలదీశారు.

ఇది కూడా చూడండి: 'రచ్చ గెలిచి ఇంట గెలిచాను'.. ఏఎన్‌ఆర్ జాతీయ అవార్డు వేడుకల్లో చిరంజీవి

కృష్ణపట్నం పోర్టు కంటైనర్‌ టెర్మినల్‌ను పునరుద్ధరించాల్సిందేనని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. జగన్‌ హయాంలో మూసేసిన ఈ పోర్టు వల్ల దాదాపుగా 10 వేల మంది ఉద్యోగాలు పోయాయన్నారు. నెల్లూరులో కృష్ణపట్నం టెర్మినల్ తరలింపుకు వ్యతిరేకంగా జరిగే పోరాటానికి అన్ని పార్టీలు మద్దతుతో పోరాడుతామన్నారు.

ఇది కూడా చూడండి:  Chiruచిరు వర్సెస్ మోహన్ బాబు..మరోసారి తెరపైకి లెజెండరీ అవార్డు వివాదం

 

#tdp-somi-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe