విజయమ్మ పేరుతో ఫేక్ లెటర్?

ఎప్పుడో జరిగిన తన కారుప్రమాదాన్ని ఇప్పుడు జరిగినట్లుగా ప్రచారం చేయడంపై వైఎస్ విజయమ్మ మండిపడ్డారు. తన కుమారుడు జగనే ఆపని చేయించినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని ఫైరయ్యారు. అయితే విజయమ్మ పేరుతో వైసీపీ వాళ్లే ఫేక్‌లెటర్ రిలీజ్ చేశారని టీడీపీ ఆరోపణ చేస్తుంది.

New Update
ys vijayamma

గతంలో వైఎస్ విజయమ్మ కారుకు ప్రమాదం జరగగా.. అదంతా జగన్ పనే అంటూ ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి. అయితే దీనిపై వైఎస్ విజయమ్మ స్పందించారు. ఎప్పుడో జరిగిన తన కారు ప్రమాదాన్ని ఇప్పుడు జరిగినట్లుగా ప్రచారం చేయడంపై తీవ్రంగా మండిపడ్డారు. అంతేకాకుండా తన కుమారుడు జగనే ఆ పని చేయించినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తనను అడ్డుపెట్టుకుని నీచ, నికృష్ణ రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఈ మేరకు ఓ లెటర్ రిలీజ్ చేశారు. 

Also Read:   ఉచిత సిలిండర్ పొందాలంటే.. ఇవి తప్పనిసరి!

విజయమ్మ పేరుతో వైసీపీ వాళ్లే ఫేక్ లెటర్

ఈ లెటర్‌పై టీడీపీ స్పందించింది. వైఎస్ విజయమ్మ పేరుతో వైసీపీ వాళ్లే ఫేక్ లెటర్ రిలీజ్ చేశారని టీడీపీ ఆరోపణ చేసింది. విజయమ్మ సంతకం కూడా వైసీపీ వాళ్లే పెట్టి విడుదల చేశారని టీడీపీ పేర్కొంది. కొద్ది రోజుల క్రితం షర్మిల రిలీజ్ చేసిన లేఖలో విజయమ్మ సంతకానికి.. ఇప్పుడు విడుదలైన లేఖలో సంతకానికి ఏ మాత్రం పొంతన లేదని విమర్శించింది. 

Also Read: JEE అభ్యర్థులకు అలెర్ట్.. ఈసారి కీలక మార్పులు!

లేటర్‌లో ఏం తెలిపారంటే?

గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం తనను తీవ్రంగా కలచి వేస్తోందన్నారు. కొంతమంది సోషల్ మీడియాలో లేనిపోని అసత్య కథనాలు ప్రచారం చేయడం చూస్తుంటే తనకు తీవ్ర మానసిక వేదన కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తనను అడ్డం పెట్టుకుని నీచ, నికృష్ణ రాజకీయాలు చేస్తున్నారని.. దానిని ఖండించకపోతే ప్రజలు నిజం అని నమ్మే ప్రమాదం ఉందని అన్నారు. 

Also read:  శబరిమల యాత్రికులకు శుభవార్త.. ఉచిత బీమా కవరేజీ 

రెండు రోజుల కిందట తన కారుకు ప్రమాదం జరిగిందని సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారన్నారు. గతంలో ఎప్పుడో జరిగిన తన కారు ప్రమాదాన్ని.. తన కుమారుడి పై పెట్టి దుష్ప్ర్పచారం చెయ్యడం అత్యంత దుర్మార్గం అన్నారు. కొందరు రాజకీయంగా లబ్ది పొందాలనే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు.

Also Read:  కార్తీకంలో ఈ పనులు చేస్తే.. ముల్లోకాల పుణ్యమంతా మీ సొంతం

రాజకీయ ప్రయోజనాల కోసం ఇంతగా దిగజారి ప్రవర్తించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని తెలిపారు. ఇలా దుష్ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించాలనే విధానం ఏమాత్రం సమర్ధనీయం కాదని పేర్కొన్నారు. ఇక పై ఇటువంటి లేనిపోని అసత్యలను ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు