MLC Election: ఏపీలో మోగిన మరో ఎన్నిక నగారా!

విజయనగరం స్థానిక సంస్థల కోటా MLC ఎన్నికకు షెడ్యూల్‌ విడుదలైంది. ఈ నెల 28న విజయనగరం జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఈ నెల 4 నుంచి 11 వరకు నామినేషన్ల స్వీకరణ, 12న పరిశీలన ఉండనుంది. రఘురాజుపై అనర్హత వేటుతో ఈ ఎన్నిక అనివార్యం అయింది.

New Update
election commission of india

MLC Election: ఏపీలో మరో ఎన్నికకు నగారా మోగింది. విజయనగరం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల అయింది. ఈరోజు నుంచి విజయనగరం జిల్లాలో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. ఈ నెల 28న విజయనగరం జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఈ నెల 4 నుంచి 11 వరకు నామినేషన్ల స్వీకరణ, 12న పరిశీలన ఉండనుంది. ఈ నెల 14 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఈ నెల 28న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు ఎమ్మెల్సీ ఎన్నికకు ఓటింగ్‌ జరగనుంది. రఘురాజుపై అనర్హత వేటుతో విజయగనరం జిల్లా ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా ఉంది.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మావోయిస్టుల హెచ్చరిక!

ఎమ్మెల్సీపై వేటు...

కాగా గతంలో విజయనగరం స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలోకి దిగిన  ఇందుకూరి రఘురాజు ఎమ్మెల్సీగా విజయం సాధించారు. ఇటీవల్ జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన వైసీపీ ఓటమి కోసం పనిచేస్తున్నారని.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను పాల్పడుతున్నారని.. టీడీపీ నాయకులతో కలిసి వివిధ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారని, ఆయన్ని శాసనమండలి సభ్యుడికి అనర్హుడిగా ప్రకటిస్తూ చర్యలు తీసుకోవాలని.. మండలిలో ఆ పార్టీ విప్ పాలవలస విక్రాంత్ చైర్మన్ కు గతంలో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 

అయితే విక్రాంత్ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన ఛైర్మన్ దీనిపై వివరణ ఇవ్వాలని ఎమ్మెల్సీ రఘురాజు నోటీసులు ఇచ్చారు. అయితే ఛైర్మన్ పంపిన నోటీసులపై ఆయన స్పందించకపోవడంతో ఆయనపై వేటు పడింది. స్పీకర్ రఘురాజును ఎమ్మెల్సీ అనర్హుడిగా ప్రకటించారు. కాగా, జూన్ 3వ తేదీ నుంచి విజయనగరం ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. 2027 డిసెంబర్‌ ఒకటి వరకు పదవీ కాలం ఉన్నప్పటికీ తనను అనర్హుడిగా ప్రకటించడంతో రఘురాజు కోర్టును ఆశ్రయించారు.  

కాగా ఇప్పుడే ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వొద్దని కేంద్ర ఎన్నికల సంఘానికి కోర్టు సూచించింది. విచారణ అనంతరం తాము ఇచ్చే ఆదేశాలకు లోబడి ఉండాలని కోర్టు తెలిపింది. అయితే. ఇంత వరకు వేచి చూసిన ఎన్నిక సంఘం.. శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా ఎన్నిక అనివార్యం కానుంది. ఇప్పటికే కూటమి, వైసీపీ ఎన్నికలకు సిద్ధమయ్యాయి. కాగా విజయనగం స్థానిక ఎమ్మెల్సీ పీఠాన్ని తిరిగి వైసీపీ కైవసం చేసుకుంటుందా? లేదా కూటమి చేసుకుంటుందా? అనేది వేచి చూడాలి. 

#ap-news #rtv #mlc-election
Advertisment
Advertisment
తాజా కథనాలు