AP Elections: ఏపీలో మరో ఎన్నికకు నగారా మోగింది. ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 3 నుంచి 10 వరకు నామినేషన్లను స్వీకరించనుంది. వచ్చే నెల 20న ఈ ఎన్నికకు పోలింగ్ జరగనుంది. వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, బీసీ సంఘం నేతం R.కృష్ణయ్య తమ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాగా ఇందులో మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు టీడీపీలో చేరారు. R.కృష్ణయ్య మాత్రం ఇప్పటి వరకు ఏ పార్టీలో చేరలేదు.
ఇది కూడా చదవండి: భారీ షాక్.. ఇప్పట్లో రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు లేనట్టే!
ఇది కూడా చదవండి: తెలుగు హీరోపై కేసు!
వైసీపీ పోటీ చేస్తుందా?..
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల తరువాత పార్టీల బలాబలాలు పూర్తిగా మారిపోయాయి. ఈ మూడు రాజ్యసభ సీట్లు కూడా టీడీపీకే దక్కే అవకాశం ఉంది. ఇందులో రెండిటిని వైసీపీకు, రాజ్యసభా సభ్యత్వానికి రాజీనామా చేసిన టీడీపీలో చేరిన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావుకు చంద్రబాబు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే R.కృష్ణయ్య రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో ఎవరికి ఛాన్స్ దక్కుతుందో అన్న అంశం ఏపీ పాలిటిక్స్ లో ఉత్కంఠగా మారింది. ఈ సీటు జనసేన లేదా బీజేపీకి దక్కే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి వైసీపీకి అసెంబ్లీలో కేవలం 11 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. దీంతో వారు అభ్యర్థిని నిలుపుతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. వైసీపీ అభ్యర్థి నిలబెట్టకపోతే.. ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఒకవేళ నిలబడితే ఎన్నిక యథాతం కానుంది.
ఇది కూడా చదవండి: కాళేశ్వరం కీలక ఫైల్స్ మాయం.. దీని వెనక ఉంది ఎవరు?
ఇది కూడా చదవండి: సీఎం పదవికి ఎకనాథ్ షిండే రాజీనామా!