మాజీ ఎంపీ, సినీ నిర్మాత ఎంవీవీ సత్యనారాయణకు ఈడీ షాక్!

మాజీ ఎంపీ, సినీ నిర్మాత ఎంవీవీ సత్యనారాయణకు ఈడీ షాక్ ఇచ్చింది. భూకబ్జా కేసుకు సంబంధించి విశాఖపట్నంలోని ఆయన ఆస్తులపై శనివారం సోదాలు నిర్వహించింది. నివాసాలు, కార్యాలయాలతో సహా 5చోట్ల సోదాలు నిర్వహించినట్లు ఈడి తెలిపింది. 

New Update
dfesr3

𝐌𝐕𝐕 𝐒𝐚𝐭𝐲𝐚𝐧𝐚𝐫𝐚𝐲𝐚𝐧𝐚: మాజీ ఎంపీ, సినీ నిర్మాత ఎంవీవీ సత్యనారాయణకు ఈడీ షాక్ ఇచ్చింది. భూకబ్జా కేసుకు సంబంధించి విశాఖపట్నంలోని ఆయన ఆస్తులపై శనివారం సోదాలు నిర్వహించింది. నివాసాలు, కార్యాలయాలతో సహా 5చోట్ల సోదాలు నిర్వహించినట్లు ఇడి తెలిపింది. ఈ మేరకు సత్యనారాయణ, అతని ఆడిటర్ గణ్మణి వెంకటేశ్వరరావు, మరో నిందితుడు గద్దె బ్రహ్మాజీ నివాసాలు, కార్యాలయాలు సహా ఐదు చోట్ల సోదాలు నిర్వహించినట్లు ఇడి వర్గాలు ధృవీకరించాయి. విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆరిలోవ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) ఆధారంగా ఈ సోదాలు జరిపినట్లు ఈడీ స్పష్టం చేసింది. ఇటీవల నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ, క్రిమినల్ బెదిరింపు ఆరోపణలతో కూడిన స్థానిక పోలీసు కేసులో సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందిన సంగతి తెలిసిందే. 

ఇది కూడా చదవండి: Rotten Chicken: స్పెషల్ చికెన్‌.. తింటే ఇక నో డౌట్ చావు ఖాయం!

సిహెచ్‌ జగదీశ్వరుడు ఫిర్యాదు..

హయగ్రీవ కన్‌స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్‌ జగదీశ్వరుడు దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు పోలీసులు. వృద్ధాశ్రమం, అనాథాశ్రమం, వృద్ధుల గృహాల నిర్మాణం కోసం ప్రభుత్వం తనకు కేటాయించిన 12.5 ఎకరాల భూమిని నకిలీ పత్రాలతో సత్యనారాయణ తదితరులు లాక్కునేందుకు ప్రయత్నించారని ఫిర్యాదు దారుడు ఆరోపించారు. హయగ్రీవ ఫార్మ్స్& డెవలపర్స్ మేనేజింగ్ పార్ట్‌నర్, విశాఖపట్నంలోని ఆదర్శ్ నగర్ నివాసి అయిన జగదీశ్వరుడు.. తాను, తన భార్య రాధా రాణి 2006 నుండి హైగ్రీవల్‌ఫ్రాటెక్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌ను కలిగి ఉన్నట్లు తెలిపారు. 2008లో వారికి యెండడ గ్రామంలో సీనియర్ సిటిజన్, అనాథ గృహాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 12.51 ఎకరాలు మంజూరు చేసిందని చెప్పారు. ఈ భూమిని 2010లో మధురవాడ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు స్పష్టం చేశారు. 

ఇది కూడా చదవండి: ఢిల్లీ మద్యం కుంభకోణం.. వర్చువల్‌గా హాజరుకానున్న కవిత

ఖాళీ కాగితాలపై బలవంతంగా సంతకాలు.. 

ఆడిటర్ వెంకటేశ్వరరావు తనకు ఎంవీవీ బిల్డర్స్‌కు చెందిన ఎంవీవీ సత్యనారాయణ, గద్దె బ్రహ్మాజీని ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ కోసం పరిచయం చేశారని జగదీశ్వరుడు పేర్కొన్నారు. 2020లో ఒక MOU సంతకం చేయబడగా.. నిందితులు ఫోర్జరీ సంతకాలు, విక్రయ పత్రాలను తయారు చేశారని బాధితుడు ఆరోపించారు. తమను బలవంతంగా ఖాళీ కాగితాలపై సంతకాలు పెట్టించారని, నిందితులు తమ విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు కుట్ర పన్నారని, తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరిస్తున్నారని ఫిర్యాదుదారుడు ఆరోపించాడు.

ఇది కూడా చదవండి: సల్మాన్‌ ఖాన్‌ను దారుణంగా చంపుతాం.. పోలీసులకు బిష్ణోయి గ్యాంగ్ మెసేజ్

గీతాంజలి (2014), అభినేత్రి (2016), లక్ ఉన్నోడు (2017), నీవెవరో (2018) వంటి చిత్రాలను నిర్మించిన MVV సత్యనారాయణ తెలుగు చిత్ర పరిశ్రమలో సుపరిచితుడు. రాజకీయాల్లో అతను 2019 లో విశాఖపట్నం ఎంపీ సీటును గెలుచుకున్నాడు. కానీ 2024 ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ టిక్కెట్ పై పోటీ చేసి ఓడిపోయాడు.

ఇది కూడా చదవండి: ప్రేమ నిరాకరించిందని.. ఇంటర్ అమ్మాయిని దారుణంగా చంపిన యువకుడు!

Advertisment
Advertisment
తాజా కథనాలు