Pawan Kalyan: ఎన్నికల ప్రచారంపై పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం
ఏపీలో రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో ప్రచారాలపై ఫోకస్ పెట్టారు. తాను పోటీ చేసే పిఠాపురం నియోజకవర్గం నుంచే ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ప్రచార రూట్ మ్యాప్ షెడ్యూల్ను ఒకట్రెండు రోజుల్లో ప్రకటిస్తామని పేర్కొన్నారు.