వీడు మగాడ్రా బుజ్జి అనే వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఎవరికైనా నిద్రస్తో ఏం చేస్తారు.. ఇంట్లో మంచంపై పడుకుంటారు లేదా నేలపై పడుకుంటారు. కానీ మనోడు మాత్రం ఏకంగా కరెంట్ తీగలపైనే పడకేసిండు. ఈ చిత్రం చూసినోళ్లంతా ముక్కున వేళుసుకుంటున్నారు.
విద్యుత్ తీగలపై నిద్ర
వీడెవడండీ బాబు ఇంతకు తెగించాడు అంటూ మాట్లాడుకుంటున్నారు. స్తంభం ఎక్కి పైన ఉన్న వైర్లపై ఎంచక్కా నిద్రిస్తు్న్న వీడియో తెగ వైరల్ కాగా.. చూసినోళ్లంతా ఓ వైపు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. మరికొందరు మాత్రం అక్కడకు వెళ్లి ఎలా పడుకున్నావ్ బ్రో అంటూ కామెంట్లు పెడుతున్నారు.
మద్యం మత్తులో కరెంట్ తీగలపై పడుకున్నాడు
— Telugu Scribe (@TeluguScribe) December 31, 2024
మన్యం జిల్లా పాలకొండ మండలం ఎం.సింగిపురంలో గ్రామస్థులను హడలెత్తించిన ఓ తాగుబోతు
మద్యం మత్తులో కరెంటు స్తంభంపైకి ఎక్కుతుండటంతో చూసిన పలువురు వెంటనే ట్రాన్స్ ఫార్మర్ ఆపేశారు
అతను ఆగకుండా పైకి వెళ్లి ఏకంగా విద్యుత్ తీగలపైనే పడుకున్నాడు.… pic.twitter.com/0p7xLgvEm6
అసలు స్తంభం ఎక్కి పడుకోవలసిన అవసరం ఏముచ్చిందంటూ ఇంకొందరు మాట్లాడుకుంటున్నారు. అయితే దానికి ఓ గమ్మత్తయిన కారణం ఉందండోయ్. 2024 ఏడాదికి చాలా మంది వీడ్కోలు పలికారు. డిసెంబర్ 31న చుక్కా, ముక్కతో ఎంజాయ్ చేశారు. మరి మనోడేమైనా తక్కువా.. బాగా మందుకొట్టాడు. ఆ మద్యం మత్తులో ఏకంగా కరెంట్ తీగలపై పడుకున్నాడు.
ఇదంతా ఏపీలోని మన్యం జిల్లాలో జరిగింది. జిల్లాలోని పాలకొండ మండలం ఎం.సింగిపురంలో ఓ వ్యక్తి తాగి గ్రామస్థులను హడలెత్తించాడు. మద్యం మత్తులో కరెంటు స్తంభంపైకి ఎక్కాడు. అది గమనించిన కొందరు వెంటనే ట్రాన్స్ ఫార్మర్ ఆపేశారు. ఆ వ్యక్తి ఆగకుండా పైకి వెళ్లి ఏకంగా విద్యుత్ తీగలపైనే పడుకున్నాడు. కాసేపు అక్కడే విన్యాసాలు చేశాడు. అందరూ కలిసి బలవంతంగా అతడిని కిందికి తీసుకొచ్చారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.