Pawan Kalyan: అధికారులకు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు

AP: ఉపాధి హామీ పనుల నాణ్యతలో రాజీ పడవద్దని డిప్యూటీ సీఎం పవన్‌ అన్నారు. ప్రతి దశలో పనుల నాణ్యతా ప్రమాణాలను తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ, ఆర్థిక సంఘం నిధులను సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు సూచించారు.

New Update
Pawan Kalyan: గ్రామపంచాయతీ నిధులపై శ్వేతపత్రం: పవన్ కళ్యాణ్

Pawan Kalyan : ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామ పంచాయతీల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడకూడదని పవన్ కళ్యాణ్ గారు అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఉపాధి హామీతోపాటు 15వ ఆర్థిక సంఘం నుంచి నిధులు వచ్చిన క్రమంలో వాటిని సక్రమంగా, పారదర్శకంగా సద్వినియోగం చేయాలని అధికారులకు తెలిపారు.

Also Read :  ముందుగానే యాంకర్ ఇన్వెస్టర్ల కోసం..మార్కెట్లోకి స్విగ్గీ ఐపీఓ ఎంట్రీ?

3,326 పంచాయతీల్లో.. 

రాష్ట్రవ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో అభివృద్ధి పనుల నాణ్యతను అధికారులు తనిఖీ చేశారు. వీటిపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ శ్రీ కృష్ణ తేజ, ఉపాధి హామీ పథకం అధికారులు, ఇంజినీరింగ్ అధికారులతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదివారం ఉదయం సమీక్షించారు. 2024 -25 సంవత్సరంలో సిమెంట్ రోడ్లు 3,000 కిలోమీటర్లు, బీటీ రోడ్లు 500 కిలోమీటర్లు, గోకులాలు 22,525, ఫారం పాండ్లు 25,000 ,  30,000 ఎకరాలకు సంబంధించి నీటి సంరక్షణ కందకాలు చేపట్టామని... వాటి పనులు పల్లె పండుగ నుంచి మొదలుపెట్టామని తెలిపారు. ఈ పనులు నిర్దేశించిన విధంగా సాగుతున్నాయని వివరించారు. 

Also Read :  ఆర్టీసీ డ్రైవర్ కు నారా లోకేష్ ప్రశంసలు.. విధుల ఉంచి తొలగించిన అధికారులు!

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..  “ఉపాధి హామీ, ఆర్థిక సంఘం నిధుల ద్వారా చేపట్టే పనులను నిర్దేశిత ప్రమాణాల ప్రకారం చేయాలి. ప్రతి దశలోనూ నాణ్యతా ప్రమాణాలు తనిఖీ చేయాలి. పనులు ఏ దశలో ఉన్నాయో కూడా ప్రజలకు తెలియచేస్తే పారదర్శకత వస్తుంది. గత పాలకుల మాదిరి పంచాయతీలకు దక్కాల్సిన నిధులను పక్కదారి పట్టడం లేదు అని ప్రజలకు తెలుస్తుంది. అదే విధంగా సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డుల ద్వారా కూడా ఏ పంచాయతీకి ఎంత నిధులు అందాయో, వాటి ద్వారా చేస్తున్న పనులు ఏమిటో కూడా ప్రజలకు వివరించే ప్రక్రియను కూడా ప్రభావవంతంగా చేపట్టాలి. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి గ్రామ సభల నిర్వహణ, పల్లె పండుగ కార్యక్రమాల ద్వారా పనుల ప్రారంభం జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించాయి. అదే విధంగా మనం చేపట్టిన అభివృద్ధి పనులను సైతం నాణ్యంగా పూర్తి చేయడం ద్వారా అందరికీ ఆదర్శంగా నిలవాలి” అన్నారు.

Also Read :  డిజిటల్ అరెస్టులపై కేంద్రం చర్యలు.. మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ

Also Read :  ఎన్నో ఏళ్ల నుంచి ఈ రోజు కోసం.. రేణు దేశాయ్ కి ఉపాసన ఏం చేసిందో తెలుసా

Advertisment
తాజా కథనాలు