AP : గుంటూరు జిల్లాలోని తెనాలిలో నవీన్ అనే యువకుడు దాడిలో తీవ్ర గాయాలపాలైన సహానా అనే యువతి బ్రెయిన్ డెడ్ కు గురైంది. తాజాగా ఆమె గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. మృతురాలు సహానాకు నిందితుడు నవీన్‌కు మధ్య ప్రేమ వ్యవహారం నడించింది. ఈ నేపథ్యంలో నవీన్ వల్ల సహానా గర్భవతి అయ్యింది.
Also Read : కళ్లు చెదిరే డ్రోన్ షో.. 5 గిన్నిస్ రికార్డులు సొంతం
Brain Dead
ఈ నేపథ్యంలో గత శనివారం నిందితుడు నవీన్ సహానాను కారులో తెనాలి పరిసర ప్రాంతాలకు తీసుకుని వెళ్లాడు. ఈ క్రమంలోనే సహానా తాను గర్భవతిని అని, తనని పెళ్లి చేసుకోవాలని నవీన్ కు చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య మాట పెరిగి, సహానాను కారు బానెట్‌కు వేసి గట్టిగా కొట్టాడు. తీవ్రంగా దాడి చేయడంతో సహానా కోమాలోకి వెళ్లిపోయింది.
Also Read : రాష్ట్రవ్యాప్తంగా 162 మంది ఏఈవోల సస్పెన్షన్!
దీంతో బ్రెయిన్ డెడ్ అయింది. ఈ నేపథ్యంలో నిందితుడు నవీన్‌ను తెనాలి పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే గడిచిన మూడు రోజులుగా సహానాకు గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్‌లో చికిత్స వైద్యులు చికిత్స చేస్తున్నారు. అయితే ఈ సాయంత్రం ఆమె గుండె పని చేయటం ఆగిపోవడంతో సహానా మృతి చెందినట్లు ప్రభుత్వ వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం సహానా మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ మార్చురీకి తరలించారు.
మద్యం మత్తులో ఇద్దరు మైనర్ బాలికలపై..
పలాసలో అమానుషం జరిగింది. మద్యం మత్తులో ఇద్దరు మైనర్ బాలికలపై ఆకతాయిలు అత్యాచారానికి పాల్పడిన ఘటన పలాస జిల్లాలో కలకలం రేపింది. 19వ తేదీన పలాస సూదికొండకు చెందిన ముగ్గురు మైనర్ బాలికలను బర్త్‌డే పార్టీకి ముగ్గురు యువకులు తీసుకువెళ్లారు. అనంతరం ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారానికి ఇద్దరు యువకులు పాల్పడ్డారు. మూడో మైనర్ బాలిక ప్రతిఘటించడంతో మూడో వ్యక్తి ఆ ఇద్దరి అత్యాచారాన్ని వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేశాడు.
ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు..
ఈ ఘాతుకంలో ఇద్దరు అక్కాచెల్లెల్లు బలైయ్యారు. తల్లిదండ్రులు కూతుర్ల భవిష్యత్తు కోసం ఈ దారుణాన్ని దాచి పెట్టారు. చిన్న కుమార్తెకు ఆరోగ్యం బాగోక పోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. తల్లిదండ్రులకు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మద్దతుగా నిలిచారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు.
Also Read : దూసుకొస్తున్న దానా..బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం!
Also Read : 80 విమానాలకు బాంబు బెదిరింపులు