/rtv/media/media_files/2025/03/01/GUmEQZCKChuMhR8lL7JE.jpg)
Mummidivaram
AP News : మందు తాగేటప్పుడు ఒక్క చుక్క కింద పడినా గుండె ఆగినంతపనవుతుంది. ఇక గ్లాసుల్లో మందు పోసేటప్పుడు ప్రతి ఒక్కరూ సైంటిస్టే. జాగ్రత్తగా కొలిచి, ఎక్కువ తక్కువ రాకుండా గ్లాస్ లో పోస్తారు. ఇలా ఒక్క చుక్క మద్యాన్నైనా వదలని మద్యం ప్రియులు ఈ వీడియో చూస్తే ఏమైపోతారో.. అయ్యో అయ్యో అంటూ నాలుక చప్పరించుకోవడం తప్పు వారేమీ చేయలేని పరిస్థితి వస్తే ఆ బాధను మాటల్లో వర్ణించలేం. తాజాగా అక్రమంగా స్వాధీనం చేసుకున్న మద్యాన్ని పోలీసులు జేసీబీతో తొక్కించారు. మూడు సంవత్సరాలుగా ఎంతో భద్రంగా చూసుకుంటున్న సీజ్ చేసిన మద్యాన్ని వరసగా పేర్చి జేసీబీ(JCB) తో తొక్కించేశారు. ఆ బాటిళ్లలోని వైన్ అంతా నేలపై వరదలా పారింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో అక్రమ మద్యాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. సంవత్సర కాలం నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకుంటున్న పోలీసులు వాటన్నింటినీ ఒక దగ్గరకు చేర్చి, జేసీబీ తో తొక్కించారు.
Also read : SLBC: లోపల కార్మికులు బతికే ఉన్నారా? లేదా?: కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన!
ముమ్మిడివరం నియోజకవర్గంలో 322 క్రిమినల్ కేసుల్లో పట్టుబడ్డ 3,860 లీటర్ల అక్రమ మద్యం (NDPL,DPL), 775 లీటర్ల సారా ను ఎక్సైజ్, పోలీస్ అధికారులు..జేసీపీతో ధ్వంసం చేశారు. ముమ్మిడివరం, కాట్రేనికోన, ఐ. పోలవరం పరిధిలో గత మూడు సంవత్సరాలలో ఈ అక్రమ మద్యం పట్టుకున్నట్లు ఎక్ససైజ్, పోలీస్ అధికారులు తెలిపారు. ప్రజల ప్రాణాలు హరించే ఇటువంటి నాన్ డ్యూటీ ఫైడ్ లిక్కర్ జోలికి వెళ్లకుండా ప్రజలు ప్రాణాలు రక్షించు కోవాలని అమలాపురం డిఎస్పీ TSK ప్రసాద్ కోరారు. నాన్ డ్యూటి పైడ్ మద్యం ధ్వంసం కార్యక్రమంలో ఎక్ససైజ్ AES జి. అమర్ బాబు, ముమ్మిడివరం సి.ఐ మోహన్ కుమార్,ఐ.పోలవరం, కాట్రేనికొన,ముమ్మిడివరం ఎస్.ఐ లు ఎక్ససైజ్ అధికారులు పాల్గొన్నారు.
Also Read : ఎండిన పొలాలను చూసి కన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి
ఈ సందర్భంగా బాటిళ్ల మద్యం, నాటుసారాను జేసీబీతో తొక్కించి ధ్వంసం చేయించారు. అక్రమ మద్యం సేవించి ప్రాణాలు కోల్పోవద్దని ఎస్ఈబీ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అక్రమ మద్యం తరలింపునకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా మద్యం ధ్వంసం విషయం తెలిసిన మద్యం ప్రియులు కళ్లముందే లీటర్ల కొద్ది మద్యం నేలపాలు కావడాన్ని చూసి గొల్లు మన్నారు.
ఇది కూడా చదవండి: Posani Arrest: పవన్‌ను అందుకే బూతులు తిట్టా.. పోసాని రిమాండ్ రిపోర్ట్‌లో షాకింగ్ విషయాలు!