AP News: చావైనా భర్తతోనే.. కంటతడి పెట్టించే విషాద గాథ

చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం మేలుందొడ్డిలో విషాదం చోటుచేసుకుంది. భర్తకు క్యాన్సర్‌ వచ్చిందని దంపతులు పొలంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి పంచనామా నిర్వహించారు.

Lovers Suicide In Tirupati: అడవిలో మైనర్‌ ప్రేమ జంట ఆత్మహత్య!

AP News

New Update

AP News: ఈ మధ్యం కాలంలో భార్యభర్తలిందరూ కలిసి జీవించడం అనేది ఓ కళ. ఎందుకంటే ఎంతో మంది చిన్నచిన్న విషయాలకే విడుపోతున్నారు. కలకాలం తోడుగా ఉంటాడుకున్న భార్యభర్తలిందరూ చిన్నపాటు ఘర్షణలకు కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటారు. మరి కొంతమంది అయితే బాధలు బరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. అయితే ఏపీలో ఓ ఆదర్శ దంపతులు జీవితమైనా.. మరణమైనా నీతోనే అంటూ దంపతులిద్దరూ కలిసి ప్రాణాలు తీసుకున్నారు.  ఈ విషాదకర ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం మేలుందొడ్డిలో చోటుచేసుకుంది.

ప్రాణం తీసిన క్యాన్సర్ రోగం:

కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బి.శ్రీనివాసులు (50), నీలమ్మ(47) దంపతులు మేలుందొడ్డి గ్రామంలో నివాసం ఉంటున్నారు. శ్రీనివాసులు టైలరింగ్‌ చేయగా.. నీలమ్మ  ఇళ్లలో పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూతురు భార్గవికి పెళ్లి చేగా, కొడుకు భానుప్రకాష్‌ బెంగళూరు ఉంటూ చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటున్నారు. కొంతకాలంగా దంపతులిద్దరూ బెంగళూరులో కుమారుడి దగ్గర ఉంటున్నారు. అయితే శ్రీనివాసులు  గత మూడు  నెలల నుంచి ఆనారోగ్యంతో బాదపడుతున్నాడు. వైద్యపరీక్షలు చేగా.. కిడ్నీకి క్యాన్సర్‌ సోకిందని తేలింది. కలకాలం తోడుగా ఉంటాడుకున్న భర్తకు క్యాన్సర్‌  అని తేలడంతో చలించిపోయింది నీలమ్మ. కష్టపడి కూడబెట్టిన డబ్బులు వైద్యానికి పెట్టినా శ్రీనివాసులు ఆరోగ్యంలో ఏ మాత్రం ఫలితం కన్పించలేదు. నిరుపేదలైన ఈ దంపతులు ఈ మయదారి రోగం నుంచి ఎలా బయటపాడాలో తెలియక లోలోపల ఎంతో మదనపడ్డారు. వేరే దారి కనిపించకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. బతుకైనా.. చావైనా నీతోనే అంటూ కలిసి ఉరేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ హృదయ విదారక ఘటన ఆదివారం రాత్రి జరిగింది.  

ఇది కూడా చదవండి: రోజూ గుడ్డు తింటే వృద్ధాప్యంలోనూ మతిమరుపు ఉండదు

రెండేళ్ల కిందట శ్రీనివాసులు అక్క లక్ష్మీదేవి కూడా క్యాన్సర్‌తో బాధపడుతూ మృతి చెందింది. అప్పట్లో ఆమెకు దగ్గరుండి వైద్యం చెపించినా ప్రయోజనం లేదు. దీంతో తీవ్ర మనోవేదన చెందారు. ఇప్పుడు ఆయనకు క్యాన్సర్‌ రావడంతో ఇద్దరూ కలత చెందారు. బెంగళూరు నుంచి ఆదివారం స్వగ్రామానికి వచ్చిన దంపతులు అల్లుడికి ఫోను చేసి మేం చనిపోతున్నాం.. దహన సంస్కారాలు చేయండని,  మీరు అందరూ బాగుండాలని బాధతో చెప్పారు. తర్వాత సమీపంలో ఉన్న పొలంలో చెట్టుకు ఉరేసుకుని  దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. చెట్టుకు వేలాడుతున్న మృతదేహాలను చూసిన స్థానికులు పోలీసులు, కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి పంచనామా చేసిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. సీఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు  తెలిపారు.

ఇది కూడా చదవండి: కిడ్నీలో రాళ్లు ఉంటే ఈ ఆహారాలు ముట్టుకోకూడదు

 

#ap-news
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe