సీఎం చంద్రబాబు మంత్రులు, ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక, మద్యం విషయంలో కీలక సూచనలు చేశారు. ఉచిత ఇసుక విషయంలో ప్రజలకు హామీ ఇచ్చానని కచ్చితంగా ఈ స్కీమ్‌ను అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. మధ్యం విషయంలో కూడా ఎవరూ వేలు పెట్టకూడదంటూ హెచ్చరించారు. కొందరు ఎమ్మెల్యేలు క్యాడర్‌ను పట్టించుకోవడం లేదని.. నా దగ్గర అన్ని వివరాలున్నాయని పేర్కొన్నారు. క్యాడర్, పార్టీ అండ లేకుండా ఏ ఒక్క ఎమ్మల్యే కూడా గెలవలేరనన్నారు. ఎమ్మెల్యేల పనితీరుపై IVRS ద్వారా సమాచారం, ఫీడ్‌బ్యాక్ తీసుకుంటానని తెలిపారు.
Also Read: ఫుట్‌పాత్ ఆక్రమణలే టార్గెట్.. హైడ్రా నెక్ట్స్ యాక్షన్ ప్లాన్ ఇదే!
'' 2014లో మనం 104 మందితోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉంటే ప్రజలకు ఎక్కువ మేలు జరగాలి. మీ పనితీరు ఆ విధంగా ఉండాలి. ఏ ఒక్క ఎమ్మెల్యే వల్ల పార్టీకి, నాకు చెడ్డపేరు వస్తే సహించేది లేదు. ఈ విషయంలో మీకు స్పష్టత ఉండాలి. ఎమ్మెల్యేలు ఎంపీలను గౌరవించాలి. అలాగే ఎంపీలు ఎమ్మెల్యేలను కలుపుకుని పోవాలి. కొంతమంది ఎమ్మెల్యేలు క్యాడర్‌ను పట్టించుకోవడం లేదు. క్యాడర్ నిర్లక్ష్యం చేస్తున్నారు. నా దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి. ఈ విధానం మంచిది కాదు. ఏ వ్యక్తి కూడా పార్టీ, క్యాడర్ లేకుండా గెలవలేరు. పార్టీ ఇచ్చిన విజయం మీది. పార్టీ వద్దు అనుకునే వాళ్లు ఇండిపెండెంట్‌గా గెలిచి ఉండాలి. పార్టీని రీస్ట్రక్చర్ చేసిన ప్రతిసారీ కార్యకర్తలు అర్థం చేసుకుని మద్దతుగా నిలిచారు.
Also Read: Isha ఫౌండేషన్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట
మనం ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీకి మంచి జరగాలని కార్యకర్తలు అధిష్ఠానం నిర్ణయాలకు మద్దతు పలికారు. పార్టీ ద్వారా గెలిచిన వాళ్లు పార్టీ సిద్దాంతాలకు, నిర్ణయాలకు కట్టుబడి పనిచేయాలి. పొలిటికల్ గవర్నెన్స్ అంటే ప్రజలకు చేసే మంచిలో మనం భాగస్వాములుగా ఉండడం. పార్టీని క్యారీ చెయ్యాలి. పబ్లిక్‌ను కన్విన్స్ చేయాలి. ఇది జరగకపోవడం వల్లే గతంలో నష్టం జరిగింది. తప్పు చేసిన వాళ్లను చట్టబద్దంగా శిక్షిద్దాం. అంతేగాని ఇష్టం వచ్చినట్లు అరెస్టులు జరగాలి అంటే కుదరదు. అది నా విధానం కాదు. చెడ్డపేరు తెచ్చుకునేందుకు మాత్రం నేను సిద్దంగా లేను.
Also Read: షేక్ హసీనాను మోదీ బంగ్లాదేశ్‌కి అప్పగిస్తారా?
ఇసుక విషయంలో ఎవరూ వేలు పెట్టవద్దు. ఇందులో తప్పు చేస్తే ఎవరినీ ఉపేక్షించవద్దని అధికారులకు స్పష్టంగా చెప్పాను. ఇసుక విధానం సక్రమంగా అమలు కాకపోతే అధికారులను కూడా బాధ్యులను చేస్తానని చెప్పాను. వాళ్లూ కూడా నిబంధనల అమలులో కఠినంగా ఉండాలి. ఇసుక విషయంలో నేను ప్రజలకు హామీ ఇచ్చాను. దాన్ని అమలు చేసి చూపాల్సిందే. ఎవరో ఒకరిద్దరు కోసం ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తే ఎందుకు సహించాలి ?. మద్యం విషయంలో కూడా ఎవరూ జోక్యం చేసుకోకండి. 2029లో మళ్లీ మీ అందరినీ గెలిపించుకోవాలని చూస్తున్నా. మీ పనితీరు కూడా బాగుండాలి. మళ్లీ త్వరలో మీ గురించి ఐవీఆర్ఎస్ ద్వారా సమాచారం, ఫీడ్ బ్యాక్ తీసుకుంటా. ప్రజలనుంచి వస్తున్న వినతులను పరిష్కరించే విషయంలో మీరందరూ శ్రద్ధ చూపాలని'' చంద్రబాబు ఎమ్మెల్యేలకు వివరించారు.