నిర్మలా సీతరామన్‌తో చంద్రబాబు భేటీ.. రాజధాని అంశంపై కీలక చర్చలు

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. రాజధాని అభివృద్ధికి ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ఇస్తున్న రూ.15 వేల కోట్ల రుణం విడుదల అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత జై శంకర్‌తో కూడా ఆయన సమావేశమయ్యారు.

CBNN
New Update

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. పలువురు కేంద్రమంత్రులతో ఆయన ప్రత్యేక సమాశమయ్యారు. ఈ నేపథ్యంలో మొదటగా ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు అందిస్తామని ఇటీవల పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాజధాని అభివృద్ధికి ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ఇస్తున్న రూ.15 వేల కోట్ల రుణం విడుదల, తదితర అంశాలపై చంద్రబాబు.. నిర్మలా సీతారామన్‌తో చర్చలు జరిపారు.   

Also Read: టాటూ వేయించుకున్న 68 మంది మహిళలకు ఎయిడ్స్!

ఏపీకి త్వరగా రుణం విడుదల చేసేలా చర్యలు తీసుకునేందుకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఇక ఆమెతో సమావేశం ముగిశాక విదేశాంగశాఖ మంత్రి జై శంకర్‌తో కూడా సమావేశం అయ్యారు. అయితే చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై అక్కడే ఉన్న ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు ఈ అంశాలను వివరించారు. '' గోదావరి-పెన్నా ప్రాజెక్టుకు కేంద్రం సహాయ సహకారాలు కోరాం. అమెరికా వెళ్లే విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంటుందనే అంశంపై కూడా చర్చించాం. ఆర్థిక రంగంలో మార్పులపై విదేశాంగ మంత్రితో సీఎం చంద్రబాబు చర్చలు జరిపారు. 

Also Read: 11వ తరగతి ఖతర్నాక్ కుర్రోడు.. 200 మందిని నిలువునా ముంచేశాడు..!

విద్యార్థులు, ప్రజల ఇమ్మిగ్రేషన్ సమస్యలు పరిష్కరించాలని విదేశాంగ మంత్రిని సీఎం కోరారు. ఏపీలో ఈజీ ఆఫ్ డూయింగ్‌తో పాటు స్పీడ్‌ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా అమలు చేస్తున్నాం. విదేశీ కంపెనీలను పెట్టుబడుల కోసం ఏపీకి ఆహ్వానించాలని చంద్రబాబు కేంద్రమంత్రిని కోరారు. ఇందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. అమరావతి నిర్మాణంలో గతంలో సింగపూర్‌ భాగస్వామ్యమైందని.. ఈసారి కూడా ఆ దేశ భాగస్వామ్మాన్ని పునరుద్దరించాలని సీఎం కోరారు. దీనికి జైశంకర్‌ కూడా సానుకూలంగా స్పందించారని'' శ్రీకృష్ణదేవరాయులు చెప్పారు. 

#telangana #national-news
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe