కొండెక్కిన కోడి ...కిలో రూ. 270!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల వచ్చిన వరదలు చికెన్ రేట్ల పై భారీ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. రిటైల్ మార్కెట్లో కేజీ 250 నుంచి 270 రూపాయల వరకు ఉంది. ధరలు పెరగడంతో చికెన్ అమ్మకాలు సగానికి సగం తగ్గాయి.

sunday
New Update

Chicken Price : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల వచ్చిన వరదలు చికెన్ రేట్ల పై భారీ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. గడిచిన మూడు వారాలుగా చికెన్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. రిటైల్ మార్కెట్లో కేజీ 250 నుంచి 270 రూపాయల వరకు ఉంది. ధరలు పెరగడంతో చికెన్ అమ్మకాలు సగానికి సగం తగ్గాయి. అమ్మకాలు తగ్గినా చికెన్ కు భారీగా డిమాండ్ పెరిగింది. 

Andhra Pradesh

విజయవాడ ప్రాంతంలో వరదల్లో భారీగా కొట్టుకుపోయిన కోళ్లు, కోళ్ల ఫారాలు.. ఇతర జిల్లాల పౌల్ట్రీల నుంచి విజయవాడ ప్రాంతానికి తీసుకోస్తున్న కోళ్లు.. దసరా నవరాత్రులు ప్రారంభమైతే చికెన్ రేట్లు తగ్గే అవకాశం ఉందంటున్న మార్కెట్ వర్గాలు.. చికెన్ ధరలు పెరిగిపోవడంతో మాంసాహారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు వరద ప్రభావం పేరుతో మార్కెట్లో నిత్యావసరాలు, కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. గుంటూరులో గత కొద్ది రోజులుగా చికెన్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి. ఈనెల ఆరంభంలో 200 రూపాయలు పలికిన చికెన్, ఇప్పుడు 270 రూపాయలుగా ఉంది.

Also Read: 'ఊ అంటావా మావా'.. IIFA వేడుకలో దుమ్ములేపిన షారుక్

#ap-news #chicken-price
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe