ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రహదారుల విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఈ మేరకు గత వైసీపీ ప్రభుత్వం ఏ ఏ విషయాలలో తప్పటడుగులు వేసిందో.. ఇప్పుడు ఆ తప్పే తమ ప్రభుత్వం చేయకూడదని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: అలా అన్నందుకే ఇంటర్ విద్యార్థినిని చంపేశాడు: ఎస్పీ హర్షవర్ధన్‌రాజు
అభివృద్ధిపై ఫోకస్
అందువల్లనే రహదారులు, ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్ల అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. వీటిని డెవలప్ చేసి మరింత మెరుగుపరచాలని ఆయన భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర నుంచి రాష్ట్రానికి అధిక మొత్తంలో నిధులు రాబడుతున్నారు.
ఇది కూడా చదవండి: ఎమ్మెల్సీ భరత్ మిస్సింగ్.. ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వండి!
ఒక్క నిధులు కేటాయింపులో మాత్రమే కాకుండా కొత్త కొత్త ప్రాజెక్టులలోనూ ఏపీకి ప్రాధాన్యత దక్కుతోంది. ఇటీవలే కేంద్రం రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ మొత్తంలో నిధులు కేటాయించిన విషయం తెలిసిందే. రోడ్లు నిర్మాణానికి కోట్లలో నిధులు విడుదల చేసింది.
ఇది కూడా చదవండి: నేటి నుంచి గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్..!
NH-516B విస్తరణకు కేంద్రం ఆమోదం
అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి ఇప్పుడు మరో శుభవార్త అందింది. విశాఖపట్నం - అరకు మార్గంలో 4 లైన్ల రోడ్లకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖపట్నం - అరకు లైన్‌లో పెందుర్తి - బౌడర మధ్య NH-516B విస్తరణకు కేంద్రం ఆమోదం తెలిపింది.
ఇది కూడా చదవండి: ఎక్కువమందిని కంటేనే ఎన్నికల్లో ఛాన్స్.. చంద్రబాబు సంచలన ప్రకటన!
కాగా ఈ రోడ్డు పెందుర్తి నుంచి కొత్తవలస, లక్కవరపుకోట, వేపాడ, శృంగవరపుకోట మీదుగా బౌడరా వరకు ఉంది. మొత్తం రూ.956.21 కోట్లతో ఈ రోడ్డు విస్తరణ పనులు రాష్ట్రం ప్రభుత్వం చేపట్టనుంది. ఇందులో భాగంగానే మొత్తం 40.5 కి.మీ మేర రోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్నారు. అయితే ఇందుకోసం దాదాపు 118 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంది.