Tirupati Bomb : తిరుపతిలోని హోటల్స్ కు వరుస బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం కలకలం రేపుతున్నాయి. గత రెండు రోజులుగా ఈ బాంబ్ బెదిరింపు ఈ-మెయిల్స్ ఆగడం లేదు. తాజాగా మూడోరోజు కూడా బాంబ్ బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఉగ్రవాద సంస్థలు మెయిల్స్ పంపినట్లు పోలీసులు తెలిపారు. జాఫర్ సాదిక్ పేరుతో మెయిల్స్ వచ్చినట్లు చెప్పారు. బాంబ్ బెదిరింపు మెయిల్స్ వచ్చిన హోటల్స్ లో పోలీసులు, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. అలాగే తిరుపతి కేటీ రోడ్డులోని ఆలయానికి కూడా బాంబు బెదిరింపు మెయిల్ వచ్చినట్లు సమాచారం.
Also Read : పేలని మంత్రి పొంగులేటి పొలిటికల్ బాంబు.. కారణం అదేనా?
మూడు హోటళ్లకు...
గత రెండు రోజుల క్రితం తిరుపతిలోని పలు హోటళ్లకు వరుస బాంబ్ బెదిరింపులు వచ్చాయి. గురువారం లీలామహల్ సెంటర్‌లోని 3 హోటల్స్‌కు, రామానుజ కూడలిలోని మరో హోటల్‌కు ఫేక్ బాంబు బెదిరింపుల రాగా పోలీసులు అప్రమత్తమయ్యారు. అలాగే కపిల తీర్థం దగ్గర్లోని రాజ్‌పార్క్ హోటల్‌ను పేల్చేస్తామంటూ మెయిల్ ద్వారా బెదిరింపులు పంపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు హోటల్లో తనికీ చేయగా ఎక్కడా పేలుడు పదార్థాలు దొరకలేదు. బాంబులు లేవని తేల్చడంతో జనాలు ఊపిరి పీలుచుకున్నారు. ఇలా పలు సార్లు ఫేక్ బాంబు ఇలా బెదిరింపులు రావడంతో.. దీని వెనుక ఎవరున్నారు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా తాజాగా మూడోసారి కూడా బాంబ్ బెదిరింపులు రావడంతో అక్కడి ప్రజలతో పాటు శ్రీవారిని దర్శించుకోడానికి వచ్చిన భక్తుల్లో ఆందోళన నెలకొంది.
Also Read : Iran సుప్రీం లీడర్ ఆరోగ్య పరిస్థితి విషమం.. తర్వాతి వారసుడు ఆయనేనా
అయితే ఇటీవలే తమిళనాడులో ఉగ్రవాది జాఫర్ సాదిక్ కు జైలు శిక్ష పడింది. ఆ శిక్ష పడేందుకు ప్రభుత్వం తరుఫున తమిళనాడు సీఎం స్టాలిన్ సహకారం అందించారు. సీఎం కుటుంబంతో పాటు తమిళనాడులోని కొన్ని స్కూళ్లలో పేలుళ్లకు ఐఎస్‌ఐ పూనుకొంది. అని మెయిల్ లో పేర్కొన్నారు. అందులో భాగంగా తిరుపతిలోని నాలుగు ప్రైవేట్ హోటళ్లను పేల్చివేస్తామని హెచ్చరించారు. దీంతో వెంటనే అప్రమత్తం అయిన పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఎక్కడా పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించుకుని ఊపిరి పీల్చుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : కాజోల్ చనిపోయిందని వార్తలు!.. నటి కామెంట్స్ వైరల్
Also Read : కోర్టుల్లో సాక్షులు ఎందుకు ప్రమాణం చేస్తారు?