/rtv/media/media_files/2025/02/03/dlQNZDT47YaWFuUH4k29.jpg)
Attack on the house of YCP ZPTC
సుమారు 60 మందికిపైగా దుండగులు మంకీ క్యాప్ లు ధరించి ఇంటిపై దాడిచేసి ఒక బుల్లెట్ వాహనానికి పెట్రోల్ పోసి నిప్పంటించారు. మరో బుల్లెట్ వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. ఇంటి సామాగ్రి ధ్వంసం చేశారు. గర్భవతి అని కూడా చూడకుండా జడ్పీటీసి కోడలు పై విచక్షణారహితంగా దాడి చేశారు.
భర్త రెడ్డయ్యతో పాటు కొడుకు రమేష్‌ను కాపాడుకునేందుకు ఇంటి వెనుక డోర్ నుంచి పంపించేందుకు రమాదేవి ప్రయత్నించగా ఆడవాళ్లు అని చూడకుండ తమపై దాడి చేశారని ఆమె ఆరోపించారు. తమ కోడలు ఆరునెలల గర్బవతిగా ఉందని ఆమె జోలికి వెళ్లద్దు అని ప్రాథేయపడిన వినకుండా దాడి చేశారని రమాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ర్టంలో శాంతిభద్రతలు లేకుండా పోయాయని, ఆడవాళ్లు , మగవాళ్లు అని తేడా లేకుండా దాడులు చేస్తున్నారని ఆరోపించారు. దాడి చేసింది ముమ్మాటికి టీడీపీ కార్యకర్తలేనని ,వారంతా మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుచరులని ఆమె ఆరోపించారు. కాగా ఇంటిపై దాడిచేసి ఇంట్లో వస్తువులు ధ్వంసం చేయడంతో పాటు తమపై దాడిచేసిన టీడీపీ మూకలపై చర్యలు తీసుకోవాలని జడ్పీటీసీ రమాదేవి కోరారు.
కాగా జడ్పీటీసీ ఇంటిపై దాడి చేయడాన్ని వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఒక మహిళా ప్రజాప్రతినిధికే రాష్ట్రంలో రక్షణ లేకుంటే మిగిలిన వారి పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు.