ఏపీకి జాక్‌పాట్.. ఆ జిల్లాలో రూ.1.40 లక్షల కోట్లతో భారీ ప్రాజెక్టు..!

ఉక్కు సంస్థలైన ఆర్సెలార్ మిట్టల్, నిప్పాన్ స్టీల్ జాయింట్ వెంచర్ అయిన AM/NS ఇండియా ఏపీలో పెట్టుబడులు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అనకాపల్లి జిల్లాలో రూ.1.4 లక్షల కోట్లతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం.

New Update
ArcelorMittal and Nippon Steel India

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత నుంచి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుంది. రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా నిధులు విడుదల చేస్తుంది. ఈ తరుణంలో పలు బడా కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు సైతం ముందుకొచ్చాయి. త్వరలో ప్రముఖ కంపెనీలు భారీ పెట్టుబడులతో భారీ ప్రాజెక్టును రాష్ట్రంలో పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. 

Also Read:  కార్తీకంలో ఈ పనులు చేస్తే.. ముల్లోకాల పుణ్యమంతా మీ సొంతం

రూ.1.4 లక్షల కోట్లతో అతి పెద్ద ప్రాజెక్ట్

దాదాపు రూ.1.4 లక్షల కోట్లతో అతి పెద్ద ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్‌కి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఉక్కు సంస్థలు అయిన ఆర్సెలార్ మిట్టల్, నిప్పాన్ స్టీల్ జాయింట్ వెంచర్ ఆర్సెలర్ మిట్టల్/నిప్పాన్ స్టీల్ ఇండియా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ఏపీలోని అనకాపల్లి జిల్లాలో 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు AM/NS India (ఆర్సెలర్ మిట్టల్/నిప్పాన్ స్టీల్ ఇండియా) భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Also read:  శబరిమల యాత్రికులకు శుభవార్త.. ఉచిత బీమా కవరేజీ 

 Also Read: JEE అభ్యర్థులకు అలెర్ట్.. ఈసారి కీలక మార్పులు!

రెండు దశల్లో ఈ ప్లాంట్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా తొలిదశలో 80,000 కోట్ల పెట్టుబడితో సంవత్సరానికి 7.3 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల బ్లాస్ట్ ఫర్నేస్ స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

దీనిబట్టి తొలిదశ కోసం దాదాపు 2,600 ఎకరాల భూమిని కంపెనీ కోరినట్లు తెలుస్తోంది. అదే సమయంలో రెండో దశలో రూ. 60వేల కోట్ల పెట్టుబడితో ఉత్పత్తి సామర్థ్యాన్ని మరో 10.5 మిలియన్ మెట్రిక్ టన్నులు పెంచుకోనున్నట్లు సమాచారం. దీని కోసం అదనంగా 2,000 ఎకరాల భూమిని కంపెనీ కోరినట్లు తెలుస్తోంది. 

Also Read:   ఉచిత సిలిండర్ పొందాలంటే.. ఇవి తప్పనిసరి!

ఇదిలా ఉంటే మరోవైపు ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా 2035 నాటికి 40 మిలియన్ మెట్రిక్ టన్నులకు తమ ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్, ఆర్సెలార్ మిట్టల్ సీఈవో ఆదిత్య మిట్టల్ మధ్య గతంలో చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు