DANA Cyclone : 100 కి.మీ వేగంతో గాలులు..ఆ రెండు జిల్లాలకు అలర్ట్‌!

దానా తుపాను నేడు వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఈరోజు అర్ధరా త్రి లేదా శుక్రవారం తెల్లవారుజామున తీరం దాటే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

Vishakhapatnam Rains: విశాఖలో భారీ వర్షం.. రాకపోకలు, స్కూళ్లు బంద్‌
New Update

APSDMA Alerts : తూర్పు మధ్య బంగాళాఖాతంలో దానా తుపాను గురువారం నాటికి తీవ్ర తుపానుగా మారే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.  దానా తుపాను నేడు వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఈ తుపాను ఈరోజు అర్ధరా త్రి లేదా శుక్రవారం తెల్లవారుజామున తీరం దాటే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. 

Also Read:  భారత్‌లోకి స్టార్‌లింక్.. అంబానీకి చెక్ పెట్టనున్న ఎలాన్‌ మస్క్‌ !

ఒడిశాలోని పూరీ- పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపం మధ్య తుపాను తీరం దాటే అవకాశాలు కనపడుతున్నాయి. మరోవైపు దానా తుపాను గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తుపాను ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో బుధవారం మధ్యాహ్నం నుంచి బలమైన ఈదురు గాలులు వీస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Also Read: అన్నా చెల్లెళ్ళ ఆస్తి వివాదం..జగన్, షర్మిల లేఖలను బయటపెట్టిన టీడీపీ

 80 నుంచి 100కి.మీ వేగంతో...

ఈ రెండు జిల్లాల్లో తీరం వెంబడి గంటకు 80 నుంచి 100కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తీర ప్రాంతాల వాసులు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.

Also Read: ఈడీ కార్యాలయంలో ముగిసిన సీనియర్ ఐఏఎస్ అమోయి కుమార్ విచారణ

తుపాను ప్రభావం, ఈదురుగాలుల నేపథ్యంలో భారీ వృక్షాలు, చెట్ల కింద ఉండొద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెప్పింది. ఎండిపోయిన చెట్లు, విరిగిన కొమ్మలను తొలగించాలని, వాటి వద్ద ఉండొద్దని హెచ్చరికలు జారీ చేసింది. అలాగే వేలాడుతూ, ఊగుతూ ఉండే రేకు/మెటల్ షీట్లతో నిర్మించిన షెడ్లకు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పాత భవనాలు, శిధిలావస్థలో ఉన్న ఇళ్లను ఖాళీ చేయాలని.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తెలిపింది. 

Also Read: శాంతి మార్గమే ఉత్తమం..ప్రధాని మోదీ, జిన్ పింగ్ మధ్య ద్వైపాక్షిక చర్చలు

కరెంట్, టెలిఫోన్ స్థంభాలు, లైన్లకు, హోర్డింగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించింది. అలాగే అనవసర ప్రయాణాలు మానుకోవాలంటూ కూర్మనాథ్ సూచించారు. తుపాను ప్రభావంతో గురువారం సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు.

ఇక దానా తుపాను కారణంగా రైల్వే శాఖ  పలు రైలు సర్వీసులను రద్దు చేసింది. మరికొన్నింటిని దారి మళ్లించారు. ఇక ఈ రైళ్ల వివరాలను తెలియజేసేందుకు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, రాయగడ రైల్వేస్టేషన్లలో రైల్వే అధికారులు హెల్ప్‌లైన్‌లను ఏర్పాటు చేశారు. 

#dana-cyclone #apsdma-alerts
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe