Sharmila : మోదీకి లోకేష్ సారీ చెప్పడంపై షర్మిల విమర్శల దాడి

AP: మంత్రి లోకేష్ పై షర్మిల విమర్శల దాడి చేశారు. మోదీకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మీరు.. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు ఎందుకు కట్టుబడిలేరు అని లోకేష్‌ను ప్రశ్నించారు. సూపర్ సిక్స్ హామీలపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

sharmila lokesh
New Update

YS Sharmila : మంత్రి లోకేష్, కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఇటీవల లోకేష్ ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో చేసిన వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు షర్మిల తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. మోదీకి మీరు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చినందుకు మీరు చాలా గర్వపడుతున్నారు లోకేష్ అని అన్నారు. కానీ ఏపీ ప్రజలకు నెరవేర్చని హామీల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని మండిపడ్డారు.

ఇది కూడా చదవండి: నేడు కోర్టుకు సీఎం రేవంత్..కానీ!

ఇచ్చిన హామీలన్నీ తూచ్...

ఎన్నికల సమయంలో అమలు కానీ అనేక హామీలు ఇచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అన్నారు. మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఇప్పటికీ నెరవేరలేదని గుర్తు చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నాలుగు నెలలు గడుస్తున్నా ఏపీ ముఖ్యమంత్రి ప్రతి వారం ఢిల్లీకి పరుగులు తీస్తున్నారని చురకలు అంటించారు. అయినా కానీ.. మోదీ ఏపీకి ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చకపోవడం సిగ్గుచేటని అన్నారు. 

ఇది కూడా చదవండి: చెన్నైలో భారీ వర్షాలు.. వరదల్లో చిక్కుకున్న రజినీకాంత్!

క్లారిటీ ఇవ్వండి...

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, పోలవరం ప్రాజెక్టులకు అతి గతి లేదని అన్నారు షర్మిల. ఫ్రాంక్లీ స్పీకింగ్ అనే టీవీ షోలో మిమ్మల్ని చూడడం చాలా బాగుందని చెప్పారు. కానీ ఇప్పుడు ఏపీ ప్రజలు తమకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంపై మీ ఉద్దేశాలను “స్పష్టంగా మాట్లాడాలని” ఆశిస్తున్నారని అన్నారు. ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడుస్తున్నా.. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. వెంటనే ఇచ్చిన హామీలపై కూటమి నేతలు మాట్లాడని డిమాండ్ చేశారు. 

ఇది కూడా చదవండి: విషాదం.. గుండెపోటుతో ఐదేళ్ల చిన్నారి మృతి!

అసలు లోకేష్ చెప్పింది ఏంటి?...

ఇటీవల మంత్రి లోకేష్ ఓ ప్రముఖ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో అనేక విషయాలను పంచుకున్నారు. ఏపీలో చంద్రబాబు అరెస్ట్ నుంచి అధికారం పీఠం దక్కించుకునే వరకు.. అధికారంలోకి వచ్చిన తరువాత తమ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కొరకు తీసుకుంటున్న నిర్ణయాలపై వివరణ ఇచ్చారు. కాగా ఎన్నికల సమయంలో ఎన్డీయే కూటమిలో భాగమైన నాడు.. ప్రధాని మోదీతో సమావేశం అయినట్లు లోకేష్ చెప్పారు. ఆనాడు తాము ఏపీలో 22 ఎంపీ సీట్లు బహుమతిగా ఇస్తామని మోదీకి చెప్పమని.. కానీ కేవలం 21 ఎంపీ స్థానాల్లో విజయం సాధించినట్లు చెప్పారు. ఈ విషయంపై మోదీకి తాను క్షమాపణలు చెప్పినట్లు తెలిపారు. కాగా దీనిపై షర్మిల ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.

Also Read :  కొండా సురేఖపై రాహుల్ గాంధీ సీరియస్..కేబినెట్ నుంచి ఔట్!

#nara-lokesh #ap-ycp #ap-chief-sharmila
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe