Ap Rains: ఏపీ పై అల్పపీడనం ప్రభావం కొనసాగుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాలో తీరాల వెంట కేంద్రీకృతమై ఉందని ఐఎండీ తెలిపింది. ఈ ప్రభావంతో బుధ, గురువారాల్లో అక్కడకక్కడ భారీ వర్షాలు మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
Also Read: Ap Deputy Speaker: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామకృష్ణరాజు
నేడు బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, గుంటూరు, జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. వర్షాల అలర్ట్‌తో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
Also Read: వచ్చే ఏడాది నుంచి ప్రవేశ పరీక్షల్లో మార్పులు.. కేంద్రమంత్రి కీలక ప్రకటన
రైతులు పంట పొలాల్లో నిలిచిన అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలలో ఉంచాలని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
Also Read: TS:బీజేపీ,బీఆర్ఎస్‌లు కవల పిల్లలు–తెలంగాణ సీం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
మరో రెండు రోజులపాటు....
ప్రకాశం జిల్లాలో మంగళవారం వాతావరణం మారిపోయింది.. వర్షాలు కురిశాయి. తూర్పుప్రాంతంలో ఒకమోస్తరు వాన పడింది. మరో రెండు రోజులపాటు జిల్లాలో వానలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది.
Also Read: Pollution: పంజాబ్‌లో కాలుష్యం.. 18 లక్షల మంది ఆస్పత్రిపాలు
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వర్షాలు రైతుల్ని భయపెడుతున్నాయి. రోడ్ల పక్కన ధాన్యం ఆరబెట్టుకుంటున్నారు.. ఇప్పటికే తుఫాన్ ప్రభావంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.కొంత నష్టమైనా తప్పని పరిస్థితుల్లో ధాన్యం బయట వ్యక్తులకు అమ్ముకోవాల్సి వస్తోందని వాపోతున్నారు.