విజయవాడలో యువతి డిజిటల్ అరెస్ట్.. రూ.1.25 కోట్లు కొట్టేసిన మోసగాళ్లు సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో విజయవాడకు చెందిన ఓ యువతి వద్ద నుంచి రూ. 1.25 కోట్లు కాజేశారు. నకిలీ ఫోన్లకు మోసపోవద్దని పోలీసులు చెబుతున్నప్పటికీ అమాయకులు మోసపోతూనే ఉన్నారు. By Bhavana 16 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి AndhraPradesh: డిజిటల్ అరెస్ట్ అంటూ వచ్చే ఫోన్లను నమ్మవద్దని పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నా అమాయకులు మోసపోతూనే ఉన్నారు. నకిలీ పోలీసుల మాటలకు బెంబేలెత్తిపోయి డబ్బులు కట్టేస్తున్నారు. కొద్ది నెలలుగా నగర వాసులను సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టేస్తూ రూ. లక్షల నుంచి కోట్లు కొల్లగోడుతున్నారు. Also Read: ట్రంప్ మరో విచిత్ర నిర్ణయం.. వ్యాక్సిన్లు వద్దన్న వ్యక్తికి హెల్త్ మినిస్ట్రీ! తాజాగా విజయవాడ గాయత్రినగర్‌కు చెందిన ఓ యువతి (25) ఇలాగే మోసపోయి సైబర్ నేరగాళ్లకు రూ. 1.25 కోట్లు చెల్లించారు. తరువాత మోసపోయినట్లు గుర్తించి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గాయత్రి నగర్ కు చెందిన యువతి హైదరాబాద్ లోని సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుంటారు. ఆమె తల్లిదండ్రులను చూసేందుకు విజయవాడకు వచ్చారు. ఉదయం 10.30 గంటల సమయంలో గుర్తు తెలియన వ్యక్తి ఫోన్ చేసి ముంబై పోలీసులమంటూ పరిచయం చేసుకున్నాడు. Also Read: ఎస్సీ వర్గీకరణపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. 60 రోజుల్లో నివేదిక! మీకు వచ్చిన కొరియర్ లో మాదక ద్రవ్యాలున్నాయని మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామంటూ భయపెట్టాడు. అరెస్ట్ కాకుండా ఉండాలంటే డబ్బులు చెల్లించాలని చెప్పడంతో యువతి కంగారు పడింది. దీంతో ఆ యువతి రూ. 1.25 కోట్లు ఆగంతకుడు చెప్పిన ఖాతాలకు పంపించారు. తరువాత ఆమె మోసపోయినట్లు గుర్తించారు. శుక్రవారం రాత్రి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితరాలు చెప్పిన వివరాల ప్రకారం నగదు బదిలీ అయిన బ్యాంకు ఖాతాల వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. సైబర్ క్రైం సీఐ గుణరాం కేసు నమోదు చేశారు. Also Read: Moisturizer: శీతాకాలంలో ఎలాంటి మాయిశ్చరైజర్ ఉపయోగించాలి? ఉన్నత హోదా ఇప్పిస్తామని.. హీరోయిన్ తండ్రికి రూ.25 లక్షలు టోకరా బాలీవుడ్ నటి దిశా పటానీ తండ్రికి ఓ దుండగులు టోకరా వేశారు. రిటైర్డ్ డిప్యూటీ ఎస్పీ జగదీశ్ సింగ్ పటానీకి ప్రభుత్వ కమిషన్‌లో ఉన్నత హోదాలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.25 లక్షలు టోకరా వేశారు. దీంతో జగదీశ్ సింగ్ బరేలీ కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. రిటైర్డ్ డిప్యూటీ ఎస్పీ దిశా పటానీ తండ్రి జగదీష్ సింగ్ పటానీ యూపీలోని బరేలీ కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వేరు ఫ్రెండ్ ద్వారా జగదీష్‌కి దివాకర్ గార్డ్, ఆచార్య జయప్రకాశ్ అనే వ్యక్తులతో పరిచయం ఏర్పడింది. రాజకీయ నేతలతో అతనికి దగ్గర సంబంధాలు ఉన్నాయని జగదీష్ పటానీను నమ్మించారు. ప్రభుత్వం ఏర్పాటు అయ్యే సమయంలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ లేదా ఉన్నత హోదా ఇస్తామని నమ్మించారు. వారు చెప్పిన మాటలు నమ్మిన జగదీష్ డబ్బులు ఇవ్వడానికి రెడీ అయ్యాడు. ఉన్నత హోదా ఉద్యోగ కోసం రూ.25 లక్షలు జగదీష్ నుంచి దుండగులు తీసుకున్నారు. ఈ డబ్బును వేర్వేరు అకౌంట్లలోకి బదిలీ చేశారు. అయితే మూడు నెలలు అవుతున్నా ఎలాంటి హోదా కల్పించలేదు. అడిగితే డబ్బులు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తామని తెలిపారు. కానీ ఎన్నిసార్లు అడిగినా కూడా ఇవ్వలేదు సహా.. బెదిరింపులకు కూడా పాల్పడ్డారు. దీంతో మోసపోయానని గుర్తించి అతను పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఈ దుండగులు పరారీలో ఉన్నారు. దీంతో పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. Also Read: Sabarimala: అయ్యప్ప దర్శనాలకు పోటెత్తిన భక్తులు..తొలిరోజే ఎంతమందంటే? #vijayawada #cyber-crime #digital arrest మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి