Posani: బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్యే...పోసాని

తనకు బెయిల్ ఇవ్వకపోతే ఆత్యహత్యే శరణమని నటుడు పోసాని కృష్ణ మురళి ఎమోషనల్ అయ్యారు. ఈరోజు ఆయనను పోలీసులు గుంటూరు మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. నా మీద కేసులు పెట్టి రాష్ట్రమంతా తిప్పుతున్నారని పోసాని కన్నీరు పెట్టుకున్నారు. 

New Update
Posani Krishna Murali Arrest

Posani Krishna Murali Arrest

ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, నారా లోకేశ్‌ ల గురించి అసభ్యంగా పోస్టు పెట్టారంటూ పోసాని కృష్ణ మురళిపై ఐదు నెలల క్రితం గుంటూరు సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు . ఆంధ్రప్రదేశ్ లో పలు చోట్ల ఆయన మీద కేసులు నమోదయ్యాయి. వీటి ప్రకారం పోసానిని కొన్ని రోజులు క్రితం ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిజానికి ఆయనకు బెయిల్ వచ్చిందని...ఈరోజు విడుదల అవుతారని వార్తలు వచ్చాయి. కానీ అది కాస్తా వాయిదా పడింది. సీఐడీ అధికారులు గుంటూరు కోర్టులో పోసానిపై పీటీ వారెంట్ దాఖలు చేయడం జరిగింది. ఇక ఏపీ సీఐడీ అధికారులు ఇచ్చిన పీటీ వారెంట్‌ను అనుమతించింది కోర్టు. దీంతో ఇవాళ పోసానిని గుంటూరు మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. 

కన్నీరు పెట్టుకున్న పోసాని..

ఈ క్రమంలో గుంటూరు మెజిస్ట్రేట్ ముందు పోసాని కృష్ణమురళి భావోద్వేగానికి గురైనట్టు తెలుస్తోంది. తనకు బెయిల్ ఇవ్వకపోతే ఆత్యహత్యే శరణమని వేడుకున్నట్టు సమాచారం. తన మీద ఎన్ని కేసులు పెట్టారో తనకే తెలియదని...రాష్ట్రమంతా తిప్పుతున్నారని పోసాని చెప్పుకొచ్చారు. తన ఆరోగ్యం బాలేదని...2 ఆపరేషన్లు జరిగాయని...ఇప్పుడు చాలా బాధ పడుతున్నానని ఆయన మెజిస్ట్రేట్ కు తెలిపారు. తప్పు చేస్తే నరికేయండి .కానీ ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదని పోసాని వేడుకున్నారని చెబుతున్నారు. వ్యక్తిగత కోపంతో తనపై కేసులు పెట్టారని ఆయన జడ్జి ముందు వాపోయారు. 

Also Read: KBC: కేబీసీకి అమితాబ్ గుడ్ బై..తర్వాత హోస్ట్ గా ఆ ముగ్గురిలో ఒకరు..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు