దీపావళి రోజే కేటీఆర్‌పై బాంబ్‌?

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పినట్లు దీపావళి రోజు పొలిటికల్ బాంబ్ పేలనుందా? KTR టార్గెట్ గా ఆ బాంబ్ బ్లాస్ట్ కానుందా? ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే ఈ ప్రశ్నకు అవును అనే సమాధానం వినిపిస్తోంది. వివరాలు ఈ ఆర్టికల్ లో..

New Update

తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. దీపావళి రోజు పొలిటికల్ బాంబ్ పడబోతుందని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ సాగుతోంది. ఈ మేరకు ఇప్పటికే రాజ్‌భవన్‌కు సైతం సమాచారం ఇచ్చినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తొలి బాంబు కేటీఆర్‌పైనే పడబోతుందని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే మళ్లీ తెరపైకి ఫార్ములా ఈ - కార్ రేస్‌ కేసు వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ వ్యవహారంపై ఏసీబీకి మున్సిపల్ అధికారులు ఫిర్యాదు చేశారు. నిధుల బదలాయింపుపై విచారణ జరపాలని అధికారులు కోరారు. గత ప్రభుత్వ హయాంలో నిబంధనలు పాటించకుండా ఫార్ములా ఈ - కార్ రేసు నిర్వహణ సంస్థకు రూ.55 కోట్లను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ చెల్లించింది.
ఇది కూడా చదవండి: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ.. సీఎం రేవంత్ సంచలన ప్రకటన

గతంలో కేటీఆర్ ఆధ్వర్యంలోనే ఈ MAUD శాఖ ఉండేది. ఇప్పటికే ఈ అంశంపై ప్రభుత్వానికి అప్పటి కమిషనర్ అరవింద్ కుమార్ వివరణ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఫార్ములా ఈ - కార్ రేసును రేవంత్ సర్కార్ రద్దు చేసింది. బోర్డు, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఓ విదేశీ సంస్థకు గత ప్రభుత్వం రూ.55 కోట్లు చెల్లించిందని ఆరోపిస్తోంది. ఈ వ్యవహారం నాటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రి అయిన కేటీఆర్ కు చుట్టుకుంటుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ వ్యవహారంలో ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉందన్న చర్చ సాగుతోంది.
ఇది కూడా చదవండి: Revanth Reddy: ఏడాదిలో పొలిటికల్ గా కేసీఆర్ ఖతం చేస్తా.. తర్వాత కేటీఆర్.. చిట్ చాట్ లో రేవంత్ సంచలనం

పొంగులేటి బాంబ్ ఇదేనా?

ఇటీవల సియోల్ పర్యటనకు వెళ్లిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్రంలో పొలిటికల్ బాంబులు పేలనున్నాయంటూ సంచలన ప్రకటన చేశారు. ఒకటి రెండు రోజుల్లోనే ఈ బాంబులు పేలుతాయన్నారు. అయితే.. ఈ నెల 26న మంత్రివర్గ సమావేశం అనంతరం ఇందుకు సంబంధించిన ప్రకటన ఉంటుందని అంతా భావించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు, ఫోన్ ట్యాపింగ్ తదితర వ్యవహారాల్లో బీఆర్ఎస్ ముఖ్యులు అరెస్ట్ ఉంటుందన్న చర్చ సాగింది. అయితే.. అలాంటిదేమీ జరగలేదు. అయితే.. దీపావళిలోగా బాంబు పేలుతుందని పొంగులేటి మంత్రివర్గ సమావేశం తర్వాత మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అయితే.. ప్రస్తుతం ఫార్ముల ఈ-కార్ రేసు కేసు వ్యవహారంలో ఏసీబీ దూకుడు చూసి పొలిటికల్ బాంబ్ ఇదేనన్న చర్చ సాగుతోంది.   

Advertisment
Advertisment
తాజా కథనాలు