ఏపీ లిక్కర్ స్కాంలో కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. విజయవాడలోని సీపీ ఆఫీస్ విజయసాయిని సిట్ విచారించనుంది. ఇదిలా ఉంటే.. ఏపీ లిక్కర్ స్కాం కేసులో సిట్ దూకుడు పెంచింది. కేసులో ప్రధాన వ్యక్తిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి సిట్ దర్యాప్తునకు సహకరించడం లేదు. ఇప్పటికీ 3 సార్లు సిట్ నోటీసులిచ్చినా ఆయన స్పందించలేదు. ఈ నేపథ్యంలో రాజ్ కసిరెడ్డి కోసం సిట్ అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. పక్కా ప్లాన్‌తో రాజ్ కసిరెడ్డి పరారైనట్లు సిట్ అనుమానిస్తోంది.
విజయసాయి రెడ్డికి షాక్ ఇచ్చిన సిట్ అధికారులు..
— Telugu Stride (@TeluguStride) April 15, 2025
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు.. ఈనెల 18న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చిన సిట్.. విజయవాడ సీపీ ఆఫీస్‌లో విచారణకు హాజరుకావాలని నోటీసులు..#LiquorScam #AndhraPradesh #VijayasaiReddy pic.twitter.com/lfNMMJSUXx
రాజ్ కసిరెడ్డి పరార్..
అత్తమామలతో కలిసి 5 రోజుల క్రితం పరారైనట్లు గుర్తించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో రాజ్ కసిరెడ్డి ఆర్థిక మూలాలను సిట్ టార్గెట్ చేసింది. రాజ్ ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టాడు..? ఎవరితో ఆర్థిక లావాదేవీలు నడిపించారు..? ఏ సంస్థలకు ఎంత చెల్లించారు..? అనే అంశాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రాజ్ కసిరెడ్డికి చెందిన 15 కంపెనీల్లో సిట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో లభ్యమైన పలు కీలక పత్రాలను సిట్ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
( telugu breaking news | telugu-news | mp-vijayasai-reddy )