ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సిట్ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. లిక్కర్ స్కాంలో వచ్చిన డబ్బులు పంచుకునేందుకు 7 ప్రాంతాల్లో డెన్‌లు ఏర్పాటు చేసినట్లు సిట్ అధికారులు చార్జ్‌షిట్‌లో పేర్కొన్నారు. తెలంగాణలో ఆరు, ఏపీలో ఒక ప్రాంతంలో డెన్‌లను గుర్తించారు.
డబ్బులు చేతులు మారే ఏడు ప్రాంతాలు
నిర్మితి ల్యాండ్ మార్క్ అపార్ట్‌మెంట్, బంజారా హిల్స్
శ్రీనివాసం అపార్ట్‌మెంట్, ఫిల్మ్ నగర్
ఉమాహిల్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్, జూబ్లీహిల్స్
పడాల్స్ హౌస్, నలందనగర్ హైదర్ గూడ
NCC అర్బన్ 1 అపార్ట్‌మెంట్, నార్సింగి
O2 స్క్వేర్ అపార్ట్‌మెంట్, నానక్‌రామ్‌గూడ
ల్యాండ్ మార్క్ అపార్ట్‌మెంట్, తాడేపల్లి, గుంటూరు జిల్లా
ప్రాంతాల్లో కోట్ల రూపాయలు చేతులు మారాయని విచారణలో తేలింది. ఇది దేశంలో అతిపెద్ద లిక్కర్ స్కామ్‌గా సిట్ అధికారులు భావిస్తున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ విలువ రూ.3500 కోట్లుగా అంచనా వేశారు. నెలకు రూ. 60 కోట్ల చొప్పున లంచాలు, కమీషన్లు, వాటాలు పంచుకున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
sit | mithun reddy liquor case enquiry | Mithun reddy arrest | latest-telugu-news | AP liquor scam case | ap liquor scam news