పోలీస్ కిష్టయ్య కుటుంబానికి ఎమ్మెల్సీ కవిత కీలక భరోసా

తెలంగాణ ఉద్యమ అమరుడు పోలీసు కిష్టయ్య 15వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కలిశారు. అన్ని విధాలుగా క్రిష్ణయ్య కుటుంబానికి అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు. కిష్టయ్యను తలచుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

author-image
By srinivas
New Update
ఇఆఇఆ

TG News: తెలంగాణ ఉద్యమ అమరుడు పోలీసు కిష్టయ్య 15వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కలిశారు. అన్ని విధాలుగా ఆయన కుటుంబానికి అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు. ఆదివారం క్రిష్టయ్య నివాసంలో ఆయన భార్య పద్మావతి, కుమారుడు రాహుల్ ను కలిసిన కవిత తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. 

కేసీఆర్ అన్ని విధాలుగా ఆదుకున్నారు..

ఈ సందర్భంగా గతంలో తమ కూమార్తె ప్రియాంక వైద్య విద్య అభ్యసించడానికి కేసీఆర్ ఆర్థిక సాయం చేసిన విషయాన్ని పద్మావతి గుర్తు చేశారు. దీంతో ఇదే తరహాలో భవిష్యత్తులోనూ బీఆర్ఎస్ పార్టీ పోలీసు కిష్టయ్య కుటుంబానికి దన్నుగా ఉంటుందని కవిత చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారి కుటుంబాలను కేసీఆర్ అన్ని విధాలుగా ఆదుకున్నారు. అమరవీరుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని కవిత డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్పీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్ తనోబా తదితరులు కవిత వెంట ఉన్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు