BIG BREAKING: అపోలో ఆస్పత్రిలో డిప్యూటీ సీఎం పవన్

ఏపీ డీప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అపోలో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో ఆయన ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్లనే టెస్ట్ లు చేయించుకున్నట్లు సమాచారం.

author-image
By Manogna alamuru
New Update
AP

AP Deputy CM Pawan Kalyan

అపోలో ఆసుపత్రిలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం  పవన్ కల్యాణ్  వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు.  దీని కోసం ఆయన ఈరోజు హైదరాబాద్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. అక్కడి వైద్యులు ఆయనకు స్కానింగ్, తత్సంబంధిత పరీక్షలు నిర్వహించారు. రిపోర్ట్స్ పరిశీలించిన వైద్యులు పలు సూచనలు చేశారు. ఈరోజు చేసినవి కాక మరికొన్ని  వైద్య పరీక్షలు అవసరం ఉందని డాక్టర్లు చెబుతున్నట్టు తెలుస్తోంది.  ఈ నెలాఖరునగానీ, మార్చి మొదటి వారంలోగానీ మిగిలిన వైద్య పరీక్షలు చేయించుకుంటారని ఆయన అనుచరులు చెబుతున్నారు. అయితే ఏది ఎలా ఉన్నా ఈ నెల 24వ తేదీ నుంచి మొదలయ్యే బడ్జెట్ సమావేశాలకు పవన్ కల్యాణ్ హాజరవుతారని..ప్రభుత్వానికి సంబంధించిన ఎటువంటి అంశాలకూ ఆయన మిస్ అవ్వరని తెలిపారు. 

గత కొంత కాలంగా..

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొన్ని రోజుల క్రితం ఆనారోగ్యం పాలయ్యారు. వైరల్ ఫీవర్ తో బాధపడ్డారు. దాంతో పాటూ స్పాండిలైటిస్ సమస్య కూడా ఆయనను ఇబ్బంది పెడుతోంది. అయినా కూడా పవన్ కల్యాణ్ తన పనులపై అశ్రద్ధ చేయడం లేదు. అనారోగ్య సమస్యలతోనే ఆయన దేవాలయాల సందర్శన కూడా చేశారు. 

Also Read: AP: మిర్చి రైతులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు