AP Crime: ఏపీలో విషాదం చోటుచేసుకుంది. కందుకూరు పట్టణంలో అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లి వెంట వెళ్లిన చిన్నారి మృత్యువాత పడ్డాడు. ప్రమాదవశాత్తూ ఆ వాహనం కిందనే పడి చనిపోయిన ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి.. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కందుకూరు మండలం అనంతసాగరంలో గోగినేని శ్రీకాంత్, నాగమణి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి భార్గవ్, మోక్షజ్ఞ(2) ఇద్దరు కుమారులు ఉన్నారు. రోజూ వారిగానే భార్గవ్ స్కూల్ బస్సు ఎక్కించేదుకు బస్సు స్టాప్ దగ్గర వెళ్లారు. ఈ సమయంలో అనుకోకుండా విషాదం చోటుచేసుకుంది. టైరు కిందపడిన చిన్నారి: పెద్ద కుమారుడు భార్గవ్ కందుకూరులోని ఓ స్కూల్‌లో ఎల్‌కేజీ చదువుతున్నాడు. రోజూలాగే ఉదయం ఆ చిన్నారిని స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లితో వెళ్లారు. చిన్నకొడుకు మోక్షజ్ఞ వారి వెంట పరిగెత్తుతూ వెళ్లాడు. వెనుక పిల్లవాడు వస్తున్నది తల్లి గమనించలేదు. భార్గవ్ బస్ ఎక్కేయడంతో డ్రైవర్ వాహనాన్ని ముందు తీశాడు. ఆ సమయంలో మోక్షజ్ఞ బస్సు ముందు ఉన్నాడు. దీంతో టైరు కిందపడి ఆ చిన్నారి తీవ్ర గాయాలతో నలిగిపోయాడు. ఇది కూడా చదవండి: జీవితంలో ఈ విషయాలను ఎప్పుడూ రహస్యంగా ఉంచాలి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న మోక్షజ్ఞను వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలొదిలాడు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యలు బోరునా విలపిస్తున్నార. మృతదేహాన్ని పట్టుకుని ఎంతో తండ్రి విలపించిన తీరు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. బస్సులో క్లీనర్ లేకపోవడమే చిన్నారి ప్రమాదానికి కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఇంట్లో ఈ స్థలంలో డబ్బు ఉంచితే పేదరికం తప్పదు ఇది కూడా చదవండి: పాలలో ఇవి కలుపుకొని తాగితే చలికాలంలో డోంట్ వర్రీ ఇది కూడా చదవండి: ఎలుగుబంటిని రక్షించిన భారత సైన్యం