Free LPG Cylinders : దీపావళి బంపర్‌ బోనాంజ…ఉచిత గ్యాస్ సిలిండర్లు!

టీడీపీ చీఫ్, సీఎం చంద్రబాబు ఓ శుభవార్త చెప్పారు.ఈ దీపావళి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్‎ను అమలు చేస్తామని తెలిపారు. దీపావళి పండుగ రోజున అర్హులకు తొలి ఉచిత సిలిండర్ అందిస్తామని..ఆయన తెలిపారు.

author-image
By Bhavana
CHANDRABABU
New Update

Chandrababu Naidu : రాష్ట్ర ప్రజలకు టీడీపీ చీఫ్, సీఎం చంద్రబాబు ఓ శుభవార్త చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై బుధవారం ఆయన ఓ కీలక ప్రకటన చేశారు. ఈ దీపావళి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్‎ను అమలు చేస్తామని తెలిపారు. దీపావళి పండుగ రోజున అర్హులకు తొలి ఉచిత సిలిండర్ అందిస్తామని.. అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా పేదలకు ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందజేయనున్నట్లు సీఎం తెలిపారు. 

సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం ఏపీ కేబినెట్ భేటీ అయ్యింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలను మంత్రి మండలి ఆమెదించింది. ఇందులో భాగంగానే ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్ అమలు చేసేందుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. దీంతో నవంబర్ నుండి ప్రభుత్వం అర్హులకు ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయనుందని ఆయన వివరించారు.

ఈ ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అఖండ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. భారీ మెజార్టీతో పవర్‎లోకి వచ్చిన కూటమి.. ఎన్నికల హామీల అమలుపై పెట్టింది. ఇందులో భాగంగానే ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు పై బుధవారం ప్రకటన వెలువడింది.

Also Read: Pagers: ఆ పేజర్లు మేం తయారు చేయలేదు!

#chandrababu #tdp #free-gas-cylinder
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe