/rtv/media/media_files/2024/12/29/FfuQlxNMvLIdfi5IMXpX.jpg)
CM Chandrababu Naidu approves 190 new ambulance vehicles in AP
ఏపీలో 16,384 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ రోజు అసెంబ్లీలో చంద్రబాబు ఇందుకు సంబంధించిన కీలక ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేస్తామన్నారు. రిక్రూట్మెంట్ పూర్తి చేసి ట్రైనింగ్ ఇచ్చి పోస్టింగ్ లు ఇస్తామన్నారు. ఆ తర్వాతనే వేసవి సెలవుల తర్వాత స్కూళ్లను తిరిగి ఓపెన్ చేస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే రైతు భరోసా స్కీమ్ ను ప్రారంభిస్తామన్నారు. మూడు విడతల్లో రైతులకు డబ్బులు చెల్లిస్తామన్నారు.
డీఎస్సీ ఇప్పటికే ప్రకటించాం. త్వరలోనే 16,354 టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం. పోస్టింగులు ఇచ్చాకే వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాలలు ప్రారంభిస్తాం. #APBudgetSession2025#APAssembly#ChandrababuNaidu#AndhraPradeshpic.twitter.com/Q3I7R2rxPT
— Telugu Desam Party (@JaiTDP) February 25, 2025
ప్రతీ హామీని నెరవేరుస్తున్నాం..
ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చుతున్నామన్నారు. సూపర్ సిక్స్ లో భాగంగా, మేనిఫెస్టోలో చెప్పిన విధంగా దీపం పథకం కింద పేదలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నామన్నారు. 48 గంటల్లో లబ్ధిదారులకు కట్టిన డబ్బు తిరిగి చెల్లిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం రూ.2,684 కోట్లు వెచ్చిస్తున్నట్లు వివరించారు. ఈ స్కీమ్ కోసం కోటిమంది రిజిస్ట్రేషన్ చేయించుకోగా 93 లక్షల మందికి గ్యాస్ సిలిండర్లు అందించామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సమయంలో తాను దీపం పథకం తెచ్చానని గుర్తు చేశారు.
సూపర్ సిక్స్ లో భాగంగా, మేనిఫెస్టోలో చెప్పిన విధంగా దీపం పథకం కింద పేదలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నాము. 48 గంటల్లో లబ్ధిదారులకు కట్టిన డబ్బు తిరిగి చెల్లిస్తున్నాం. ఇందుకోసం రూ.2,684 కోట్లు వెచ్చిస్తున్నాం. కోటిమంది రిజిస్ట్రేషన్ చేయించుకోగా 93 లక్షలమందికి గ్యాస్… pic.twitter.com/ZOsSIyyGK7
— Telugu Desam Party (@JaiTDP) February 25, 2025
ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అన్నీ అమలుచేస్తామని స్పష్టం చేశారు. అనుక్షణం తాము ఇచ్చిన హామీలు కోసం పని చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ రూ.1000 పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ దేశంలోనే అతి పెద్ద సంక్షేమ కార్యక్రమం ఇదన్నారు. ఏడాదికి రూ.33 వేల కోట్లు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం ఖర్చు చేస్తున్నాం