నేను మీకు అండగా ఉంటా.. వారికి మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక హామీ!

జాతీయ రైస్ మిల్లర్లకు ఏపీ పౌర సరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా యూనిఫాం పాలసీ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. రైస్ మిల్లర్ల ఇబ్బందులన్నీ కూటమి ప్రభుత్వం పరిష్కరిస్తుందని, ఎవరికీ నష్టం చేసే ఆలోచన తమకు లేదన్నారు.

New Update
Nadendla Manohar: సీఎం జగన్ GER సర్వే ఫలితాలను బయట పెట్టాలి

AP News: జాతీయ రైస్ మిల్లర్లకు ఏపీ పౌర సరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక హామీ ఇచ్చారు. మిల్లర్ల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ సానుకూలంగా ఉంటుందన్నారు. తమ ప్రభుత్వంలో అందరికీ మంచి రోజులే ఉంటాయని, ఎవరికీ ఇంబ్బందులు లేకుండా చూస్తామన్నారు. ఈ మేరకు విజయవాడలో సోమవారం జాతీయ రైస్ మిల్లర్స్ అసోయేషన్ సమావేశంలో పాల్గొన్న నాదెండ్ల మనోహర్.. దేశ వ్యాప్తంగా ఉన్న రైస్ మిల్లర్లు అందరూ ఇక్కడకు రావడం ఆనందంగా ఉందన్నారు. 

దేశవ్యాప్తంగా యూనిఫాం పాలసీ..

గ్రామీణ ప్రాంతాల్లో రైస్ మిల్లులు పెట్టి ఎంతోమందికి ఉపాధి కల్పించారు. దేశవ్యాప్తంగా యూనిఫాం పాలసీ తీసుకు వచ్చే విధంగా అందరం కలిసి లోతుగా అధ్యయనం చేద్దాం. ప్రజలు ఎంతో నమ్మకంతో కూటమికి పట్టం కట్టారు. మనమంతా వినియోగదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు చేయాలి. పీడీయస్ బియ్యం అక్రమ రవాణాను నిరోధించేలా చర్యలు తీసుకుంటున్నాం. గతంలో స్థానికంగా జరిగే అక్రమ రవాణాను.. గత ప్రభుత్వంలో ఏకంగా ఎగుమతులు చేసే మాఫియా తయారైంది. ఇటువంటి అక్రమార్కులకు మీరంతా దూరంగా ఉండాలి, ప్రోత్సహించ వద్దు. మిల్లర్ల సమస్యలపై చర్చ చేసి.. తప్పకుండా మీ ఇబ్బందులను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 

ఇది కూడా చదవండి: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్.. నలుగురు సీనియర్లు ఔట్!

ఎం.డి.యూ యూనిట్లకు 1645 కోట్లు..

అలాగే.. నేను మాట ఇస్తున్నా.. ప్రతి గింజ కొనే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. గతంలో కావాలనే కొన్ని మిల్లులకే బియ్యం కొనుగోలు అవకాశం ఇచ్చారు. ఇతర మిల్లర్లను ఉద్దేశపూర్వకంగా దెబ్బ కొట్టారు. ఎం.డి.యూ యూనిట్లు పెట్టి 1645 కోట్లు ప్రజాధనాన్ని ఉపయోగించారు. 9 వేల రేషన్ షాపుల ద్వారా ప్రజలకు మంచిగా సరుకులు అందేవి. ఇంటింటికీ రేషన్ పేరుతో పెద్ద స్కాంకు తెర తీసి, దోచుకున్నారు. గోనె సంచుల విషయంలో ఇప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేశాం. ప్రజలకు, రైతులకు, మిల్లర్లకు మేలు చేయాలనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆలోచన చేస్తూ ఉంటారు. పౌరసఫరాలశాఖ తరపున మీకు నేను అండగా ఉంటాను. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా పాలన కొనసాగిస్తోంది. కొంతమందికి లాభం, మరికొంతమందికి నష్టం చేసే ఆలోచన మాకు లేదు. అందరం కలిసి అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందేలా, రాష్ట్ర అభివృద్దిలో అందరూ భాగస్వామ్యం కావాలనేదే మా ఆకాంక్ష అని అన్నారు. 

ఇది కూడా చదవండి: శివరాత్రికి 'తమ్ముడు' వస్తున్నాడు.. నితిన్ కొత్త సినిమా పోస్టర్ అదుర్స్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు