GVMC Mayor: వైసీపీకి మరో దెబ్బ.. విశాఖ పీఠంపై కూటమి జెండా.. కాబోయే మేయర్ అతనే!

విశాఖ మేయర్ హరి వెంకట కుమారిపై ఇతర సభ్యులు పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. 2/3 మెజారిటీతో కూటమి మేయర్ సీటును కైవసం చేసుకుంది. టీడీపీ నేత పీలా శ్రీనివాస్‌ మేయర్‌ కాబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. 

New Update

గ్రేటర్ విశాఖ మేయర్ పీఠంపై సస్పెన్స్ వీడింది. 2 నెలల ఉత్కంఠకు తెర పడింది. మేయర్ హరి వెంకట కుమారిపై ఇతర సభ్యులు పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. 2/3 మెజారిటీతో కూటమి మేయర్ సీటును కైవసం చేసుకుంది. అవిశ్వాసానికి అనూకులంగా 74 మంది సభ్యులు ఓటు వేశారు. అయితే.. ఓటమిని పసిగట్టిన వైసీపీ కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించింది. ఇదిలా ఉంటే.. టీడీపీ నేత పీలా శ్రీనివాస్‌ మేయర్‌ కాబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ సందర్భంగా అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ.. న్యాయం, ధర్మం గెలిచిందని వ్యాఖ్యానించారు. వైసీపీ అరాచక పాలనకు కార్పొరేటర్లు చరమగీతం పాడారని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు.  

గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూటమి నేతలు జీవీఎంసీపై ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలోనే అతి పెద్ద కార్పొరేషన్ అయిన జీవీఎంసీని కైవసం చేసుకోవడానికి పావులు కదిపారు. గత నెలరోజులు ఈ ప్రయత్నాలను మరింత తీవ్రం చేశారు. ప్రతిపక్ష వైసీపీ సైతం మేయర్ పదవిని కాపాడుకోవడానికి విశ్వప్రయత్నం చేసింది.

విదేశాల్లో క్యాంపులు..

ఇరు పార్టీల నేతలు విదేశాల్లో సైతం క్యాంపులు ఏర్పాటు చేశాయంటే.. పోటీ ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. అయితే.. ఆఖరికి విశాఖ పీఠంపై అధికార కూటమి పాగా వేసింది. దీంతో ఆయా పార్టీల నేతలు సంబరాల్లో మునిగిపోయారు. కూటమి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

(telugu-news | telugu breaking news | latest-telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు