/rtv/media/media_files/2025/06/27/andhra-pradesh-kadapa-woman-dies-in-electric-bike-explosion-2025-06-27-13-00-23.jpg)
Andhra Pradesh kadapa Woman dies in electric bike explosion
ఏపీలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్క సారిగా బ్లాస్ట్ అయింది. ఈ ఘటనలో స్పాట్‌లో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read : సింగిల్ ఛార్జింగ్.. 500 కి.మీ మైలేజ్‌తో 2 కొత్త కార్లు.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
ఎలక్ట్రిక్ స్కూటర్ బ్లాస్ట్
ఏపీలోని కడప జిల్లా యర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో ఈ ఘటన జరిగింది. ఎలక్ట్రిక్ స్కూటర్‌కి ఛార్జింగ్ అవుతుండగా ఒక్కసారిగా పెద్ద పేలుడు సంభవించింది. దీంతో పక్కనే నిద్రిస్తున్న వెంకట లక్ష్మమ్మ (62) అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మహిళ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
Also Read : జూలైలో స్మార్ట్‌ఫోన్ల జాతరే జాతర.. నథింగ్, శాంసంగ్, వన్‌ప్లస్ నుంచి కిర్రాక్ మొబైల్స్!
మరోక ఘోరమైన ఇన్సిడెంట్
ఇదిలా ఉంటే అనంతపురం జిల్లాలో మరో ఘోరమైన ఇన్సిడెంట్ జరిగింది. తాడిపత్రి మండలంలో శుక్రవారం రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. బోడాయిపల్లి గ్రామంలో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో వ్యక్తిపై వేట కొడవళ్లతో దాడి చేశారు. నడిపి కుల్లాయప్ప వరి పొలంలో వ్యవసాయ పనులు చేసుకుంటుండగా ఒకేసారి 6 మంది దాడికి దిగారు. కుల్లాయప్ప తరపు కూడా మరి కొందరు ఎదురుదాడికి వచ్చారు. దీంతో ఘర్షణలో ఐదుగురి తీవ్రగాయల పాలైయ్యారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Also Read : మరి కాసేపట్లో స్క్విడ్ గేమ్ ఆఖరి పోరు! ఇండియాలో స్ట్రీమింగ్ టైమ్ ఇదే
Follow Us