Ap: ఏపీ యువతకు గుడ్‌ న్యూస్.. నెలకు రూ.15 నుంచి 40వేలు జీతంతో పాటు!

ఏపీ ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ఓ కీలక నిర్ణయం తీసుకుంది.డిగ్రీలోపు చదువుకున్న నిరుద్యోగ యువతకు 1.10 కోట్ల మంది ఉండటంతో.. వారికి ఒకేషనల్‌ రంగంలో ఉపాధి కల్పించే పనిలో ఏపీ ప్రభుత్వం పడింది.

AP : నేడు ఏపీ కొత్త టెట్‌ నోటిఫికేషన్‌.. దరఖాస్తులు ఎప్పటి నుంచి అంటే!
New Update

ApNews: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేషనల్‌ ఉద్యోగాల రంగంలో భారీ ఉపాధి అవకాశాలు ఉండడంతో ఏపీఎస్‌ఎస్‌డీసీ (నైపుణ్యాభివృద్ధి సంస్థ) దీనిపై ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో డిగ్రీలోపు చదువుకున్న నిరుద్యోగ యువతకు 1.10 కోట్ల మంది ఉండటంతో.. వారికి ఒకేషనల్‌ రంగంలో ఉపాధి కల్పించే పనిలో ఏపీ ప్రభుత్వం పడింది.

Also Read:  నవంబర్‌ లో బ్యాంకులకు 12 రోజులు సెలవులు!

ఈ మేరకు వారికి నైపుణ్య శిక్షణ చేపట్టింది. వీరికి ప్రారంభ వేతనం చాలా తక్కువగా ఉండటంతో.. ఈ అవకాశాలను పట్టించుకోవడం లేదు. దీంతో నిపుణుల కొరత ఏర్పడింది. రాష్ట్రంలో  వేలసంఖ్యలో కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫ్లంబర్, ఏసీ రిపేరర్ వంటి ఉద్యోగాలు చాలానే ఉన్నట్లు సమాచారం. లింక్డ్‌ఇన్, నౌకరీ లాంటి జాబ్‌ పోర్టల్స్‌ నివేదికల ప్రకారం దీనిని అధికారులు గుర్తించారు. 

Also Read:  కోదాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం...30 మంది!

అయితే క్లరికల్‌ ఉద్యోగాలతో పోలిస్తే.. ప్రారంభంలో ఇచ్చే వేతనాలు కొంత తక్కువగా ఉన్నా సీనియారిటీ వచ్చే కొద్దీ మంచి వేతనాలు అందిస్తున్నారు.  ఈ ఉద్యోగాల్లో ప్రారంభంలో టెక్నీషియన్‌కు రూ.15-18వేల జీతం వస్తోంది. వీరు రెండేళ్ల తర్వాత సూపర్‌వైజర్‌ అయితే రూ.30-40వేలు వస్తున్నాయి. అంతేకాదు వీరు భవిష్యత్తులో సొంత కంపెనీలను ఏర్పాటు చేసుకునే అవకాశాలు కూడా చాలానే ఉన్నాయి.  ఇలాంటి ఆలోచన నుంచి వచ్చిందే అర్బన్ కంపెనీ. 

Also read: లెబనాన్‌ పై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌...కూలిన భారీ భవనాలు!

విదేశాల్లో ఈ కంపెనీలకు ఇప్పుడు డిమాండ్‌ ఉంది. అలాగే డీటీపీ, ప్రకటనలు, డిజిటల్‌ వ్యాపారంలో అవకాశాలకు శిక్షణ కూడా ఇస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం రెండు సంస్థలు ఈ ఒకేషనల్ ఉద్యోగాల కోసం ట్రైనింగ్‌ ఇస్తున్నాయి. రివలూష్యనరీ సంస్థ శిక్షణ ఇచ్చి, ఉద్యోగాలు కూడా కల్పిస్తుంది. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థతో కలిసి రివలూష్యనరీ సంస్థ విజయవాడలో ఎలక్ట్రీషియన్‌ శిక్షణ  ఇస్తుంది. ఇదే సంస్థ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కందుకూరులోనూ రెండు వారాల్లో శిక్షణ ప్రారంభించనున్నారు. 

Also Read: తిరుపతిలో దారుణం...మూడున్నరేళ్ల చిన్నారి పై అత్యాచారం..ఆపై చంపి..!

ఈ ఒకేషనల్‌ ఉద్యోగాల శిక్షణ 2-3 వారాలు ఉంటుంది.. శిక్షణ తీసుకునేవారికి లేటెస్ట్ టూల్‌కిట్‌పై శిక్షణ ఇచ్చి, కిట్‌ను అందిస్తున్నారు. శిక్షణ సమయంలో ఉచిత వసతి, భోజన సౌకర్యం ఉంటుంది. ఈ సంస్థ ఏడాదికి ఈ రంగంలో 7వేల ఉద్యోగాలు కల్పిస్తుంది. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా 10 ప్రాంతాల్లో శిక్షణ ప్రారంభించాలని భావిస్తున్నారు.

మరోవైపు శ్రీసైనేజెస్‌ సంస్థ నాన్‌ గ్రాడ్యుయేట్లకు స్థానికంగా అవకాశాలు కల్పించేందుకు శిక్షణ ఇస్తోంది. డీటీపీ, సైనేజ్‌ ఫ్యాబ్రికేషన్‌లో వంటి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నారు. 

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe