ఉచిత సిలిండర్ పథకం.. నేటి నుంచి బుకింగ్స్ స్టార్ట్

ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి నేటి నుంచి బుకింగ్స్ మొదలుకానున్నాయి. వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరూ కూడా ఈ పథకానికి అర్హులు. ఉచిత సిలిండర్‌ను ఈ రోజు బుక్ చేసుకుంటే దీపావళికి డెలివరీ చేస్తారు.

free gas cylinder scheme
New Update

ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఉచిత సిలిండర్ ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే దీపావళి నుంచి ఈ ఉచిత సిలిండర్లు పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. దీంతో మంగళవారం నుంచి అనగా ఈ రోజు నుంచి సిలిండర్ బుక్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తోంది.

ఇది కూడా చూడండి: చైనాలో వేలాది స్కూల్స్ మూసివేత.. ఎందుకో తెలిస్తే షాక్

వైట్ రేషన్ కార్డు ఉన్నవారు మాత్రమే..

ఈ రోజు సిలిండర్ బుక్ చేసుకున్న వారికి దీపావళి రోజున డెలివరీ చేస్తారు. అయితే సిలిండర్ కోసం గ్యాస్ ఏజెన్సీకి రూ.811 కట్టాలి. మళ్లీ ఈ మొత్తం రెండు రోజుల్లో మీ అకౌంట్లలోకి జమ అవుతుంది. వైట్ రేషన్ కార్డు ఉన్నవారంతా ఈ ఉచిత సిలిండర్‌కు అప్లై చేసుకోవచ్చు. 

ఇది కూడా చూడండి: ధంతేరాస్ స్పెషల్.. 10 నిమిషాల్లో బంగారం, వెండి డెలివరీ

ఇదిలా ఉండగా.. ఈ మూడు సిలిండర్లు ఏడాదిలో మూడు విడతలుగా ఇవ్వనున్నారు. అక్టోబర్ 31 నుంచి మార్చి నెలాఖరులోగా ఒకటి. ఏప్రిల్ 1, 2025 నుంచి జులై వరకు మరొకటి. జులై నుంచి నవంబర్ వరకు మూడో సిలిండర్ ఉచితంగా ఇవ్వనున్నారు. అయితే ఈ పథకం అమల్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా.. 1967 ట్రోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేయాలని ప్రభుత్వం సూచించింది. ఇక ఉచిత గ్యాస్ బుకింగ్‌కు తప్పకుండా తెల్ల రేషన్‌కార్డు, ఆధార్ కార్డుదారులు ఉండాలి.

ఇది కూడా చూడండి: 'రచ్చ గెలిచి ఇంట గెలిచాను'.. ఏఎన్‌ఆర్ జాతీయ అవార్డు వేడుకల్లో చిరంజీవి

ప్రస్తుతం గ్యాస్ సిలిండర్‌ను ఆన్‌లైన్‌లో బుకింగ్ చేస్తే.. ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ ద్వారా బుకింగ్ జరుగుతోంది. గ్యాస్ ఏజెన్సీల వద్ద వినియోగదారుల ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్ అండ్ బ్యాంక్ అకౌంట్ మాత్రమే ఉంటున్నాయి. కానీ తెల్ల రేషన్‌కార్డుల సమాచారం ఉండదు. అలా సమాచారం లేకపోతే ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యపడదు. అంతేకాకుండా సబ్సిడీ కూడా రావాలంటే రేషన్‌కార్డు వివరాలు కూడా ఉండాలి.

ఇది కూడా చూడండి:  Chiruచిరు వర్సెస్ మోహన్ బాబు..మరోసారి తెరపైకి లెజెండరీ అవార్డు వివాదం

#free-gas-cylinder
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe