Viral Video: ఇలా తయారయ్యారేంట్రా బాబు: ఫ్రీ ఫైర్ గేమ్‌ కోసం ఎలా బాదుకున్నారో చూడండి!

ఏపీలోని ఏలూరులో ఫ్రీ ఫైర్ గేమ్ విషయంలో విద్యార్థుల మధ్య వివాదం చెలరేగింది. దీంతో జిల్లా పరిషత్ పాఠశాల ఎదురుగా గల రోడ్డులో రెండు వర్గాలుగా విడిపోయి చితకబాదుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.

New Update
Andhra Pradesh eluru students fight on Free Fire game controversy

Andhra Pradesh eluru students fight on Free Fire game controversy

Viral Video: పబ్జి గేమ్(PUBG game) యువతను ఎంతలా ప్రభావితం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ గేమ్ మాయలో పడి ఎంతో మంది విద్యార్థులు పిచ్చోలైపోయారు. మరెంతో మంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇక ఈ గేమ్‌ మాదిరిగానే మరో గేమ్ వచ్చింది. అదే ఫ్రీ ఫైర్(Free Fire). పబ్జీ గేమ్‌కు సపోర్ట్ చేయని ఫోన్ యూజర్లందరూ ఈ ఫ్రీ ఫైర్ గేమ్ డౌన్‌లోడ్ చేసుకుని వాడుతున్నారు. 

Also Read: Horoscope Today: నేడు ఈ రాశి వారికి వాహన ప్రమాదాలు జరిగే సూచనలున్నాయి... జాగ్రత్త!

ముఖ్యంగా కరోనా సమయంలో ఈ గేమ్‌లకు ఆదరణ పెరిగింది. ఇంటి వద్దనే ఉంటూ చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఈ గేమ్‌ను ఆడుకునేవారు. ముఖ్యంగా 15 ఏళ్ల నుంచి 25ఏళ్ల లోపు ఉన్న వారే ఈ గేమ్‌కు ఎక్కువగా అట్రాక్ట్ అయ్యారు. స్క్వాడ్ అంటూ కొందరు, సోలో అంటూ ఇంకొందరు గ్రూపులు గ్రూపులుగా సెట్టైపోయేవారు. ఉదయం లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు ఆడుతూనే ఉండేవారు. తిండి ఉండేది కాదు.. రాత్రి పడుకుంటే కలలో కూడా వాడిని కాల్చు, వీడిని కాల్చు అంటూ ఒకటే కలవరింతలు.

అయితే ఇప్పుడిప్పుడు ఫ్రీ ఫైర్ గేమ్ ఆడేవారి సంఖ్య తగ్గింది. అక్కడక్కడ కొందరు ఈ గేమ్ ఆడుతున్నారు. ఇప్పుడిదే ఫ్రీ ఫైర్ గేమ్‌ వివాదానికి దారి తీసింది. ఈ గేమ్ కోసం గొడవ పడి కొందరు విద్యార్థులు నడి రోడ్డుపై చితక బాదుకున్నారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో చోటుచేసుకుంది. 

Also Read: Anand Mahindra: భారత్‌ లో టెస్లా..ఆనంద్‌ మహీంద్రా కీలక వ్యాఖ్యలు!

Also Read: IT Refunds: రిటర్నులు ఆలస్యమయ్యాయా..అయితే  నో రిఫండ్‌.. ఐటీ శాఖ ఏమందంటే!

రోడ్డుపై చితకబాదుడే

ఫ్రీ ఫైర్ గేమ్‌ విషయంలో తలెత్తిన వివాదం మరింత ముదిరింది. దీంతో ఏలూరులోని జిల్లా పరిషత్ పాఠశాల ఎదురుగా గల రోడ్డులో రెండు వర్గాలుగా విడిపోయారు. దీంతో వీధి రౌడీల్లా మారి ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రస్తుతం వారు బాదుకున్న వీడియో వైరల్ అవుతోంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు