Ap News: తాము చనిపోయేందుకు అనుమతి ఇవ్వాలంటూ వృద్ధ దంపతులు ఏలూరు కలెక్టర్‌ను ఆశ్రయించిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఏలూరు రూరల్ మండలం గుడివాకలంకకు చెందిన సైదు ఇజ్రాయేలు, సైదు మహాలక్ష్మి దంపతులు కారుణ్య మరణాన్ని అనుమతించాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.
Also Read: నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ శుభవార్త!
నాలుగు సంవత్సరాలుగా..
తమ భూమిలోకి వెళ్లనివ్వకుండా గ్రామ పెద్దలు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు సంవత్సరాలుగా గ్రామ పెద్దలు వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఫలితం దక్కలేదు.
Also Read: ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్..పండగ చేస్కోండి!
కేసు పెట్టారన్న కోపంతో గ్రామ పెద్దల వేధింపులు మరింత పెరిగాయని వృద్ధ దంపతులు అన్నారు. తమను ఊరి నుంచి వెలివేశారని దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఆరోగ్యం బాగోలేక ఆస్పత్రిలో చూపించుకోవడానికి కూడా డబ్బులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: కిలో వెండి అక్షరాల లక్ష రూపాయలు!
గ్రామ పెద్దలు వేధింపులు భరించలేక కారుణ్య మరణం కోరుతూ ఏలూరులో కలెక్టర్‌కు వృద్ధ దంపతులు వినతిపత్రం అందజేశారు.
Also Read: హనీ ట్రాప్ వెనుక వైసీపీ నేతలు..? వెలుగులోకి సంచలన విషయాలు