Ap News: ఏపీలో మందుబాబులకు గుడ్‌ న్యూస్‌..పండగ చేస్కోండి!

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన క్వార్టర్‌ రూ.99 మద్యం కూడా షాపుల్లో అందుబాటులోకి రానుంది. అక్టోబర్‌ చివరి నాటికి 2.4 లక్షల కేసులు అందుబాటులోకి తీసుకొస్తామని ఎక్సైజ్‌ శాఖ తెలిపింది.

New Update
https://rtvlive.com/telangana/ponguleti-srinivas-reddy-seoul-visit-south-korea-river-musi-project-telugu-news-7345442

Ap: ఏపీలో కొత్త మద్యం పాలసీ గతవారమే ప్రారంభం అయ్యింది. వారం రోజులుగా కొత్త మద్యం షాపుల్లో అమ్మకాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అన్ని బ్రాండ్ల మద్యం కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన క్వార్టర్‌ రూ.99 మద్యం కూడా షాపుల్లో అందుబాటులోకి రానుంది. అక్టోబర్‌ చివరి నాటికి 2.4 లక్షల కేసులు అందుబాటులోకి తీసుకొస్తామని ఎక్సైజ్‌ శాఖ తెలిపింది.

Also Read:  కిలో వెండి అక్షరాల లక్ష రూపాయలు!

 రూ.99కే క్వార్టర్ మద్యానికి క్రేజ్ పెరిగింది. మరికొన్ని కంపెనీలు కూడా తక్కువ ధరకు నాణ్యమైన మద్యం తీసుకొస్తే ఎలా ఉంటుందని ఆసక్తి చూపిస్తున్నాయని తెలుస్తుంది. రాష్ట్రంలో తక్కువ ధరకు వస్తున్న లిక్కర్‌ బ్రాండ్ల అమ్మకాలు పెరుగుతాయని.. కంపెనీలు తమ బ్రాండ్లను కూడా తక్కువ ధరకు తీసుకొస్తే ఎలా ఉంటుందని ఆలోచనలో ఉన్నారు. అలాగే మీడియం కేటగిరీ మద్యం ఉత్పత్తి చేసే ప్రముఖ కంపెనీలు ఎక్సైజ్‌ శాఖతో చర్చలు జరిపినట్లు సమాచారం. 

Also Read: కరీంనగర్‌లో ఈఎస్ఐ హాస్పిటల్.. బండి విజ్ఞప్తికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

ఇప్పటికే నాలుగు కంపెనీలు ఏడు రకాల బ్రాండ్లను రూ.99కే సరఫరా చేసేందుకు అనుమతులు కూడా వచ్చాయి. దాదాపు 30 వేల కేసులను ఉత్పత్తి చేసినట్లు సమాచారం. ఈ మద్యం ఆర్డర్లు కూడా పెరిగాయని తెలుస్తుంది. రాబోయే రోజుల్లో రూ.99కే క్వార్టర్ మద్యం అందించే కంపెనీలు కూడా పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.

Also Read:  రాష్ట్రంలో బాణాసంచా నిషేధం.. గోదాంలు సీల్ చేయాంటూ హైకోర్టు ఆదేశాలు!

రాష్ట్రంలో అమ్మకాల ట్రెండ్‌ ఆధారంగా తాము కూడా అదే ధరకు మద్యం సరఫరా చేస్తే ఎలా ఉంటుందని పలు కంపెనీలు కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. మరికొంతకాలం చూసిన తరువాత వినియోగదారుల స్పందన చూసి ముందుకు రావాలని మరికొన్ని కంపెనీలు భావిస్తున్నాయట. రాష్ట్రంలో తక్కువ ధర ఉన్న మద్యంపై వ్యాపారులకు తక్కువ మార్జిన్‌ వస్తుంది.. అదే ఎక్కువ ధర ఉన్న మద్యం విక్రయిస్తే ఎక్కువ మార్జిన్‌ వస్తుంది కాబట్టి, తక్కువ ధర మద్యాన్ని ఎక్కువగా తీసుకోకపోవచ్చనే గుసగుసలు కూడా వినపడుతున్నాయి.

Also Read: గొప్ప మనసు చాటుకున్న మంచు లక్ష్మి.. 50 స్కూళ్ళు దత్తత తీసుకొని.

రూ.99కే నాణ్యమైన మద్యం..

మరోవైపు రూ.99కే క్వార్టర్‌ మద్యం బాటిల్స్ కొన్ని జిల్లాల్లో గత శుక్రవారం నుంచి అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. సోమవారం నుంచి ఇంకొన్ని షాపుల్లో రూ.99కే క్వార్టర్ మద్యం అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వం రూ.99కే క్వార్టర్ నాణ్యమైన మద్యం అందిస్తామని ప్రభుత్వం వివరించింది. ఈ మేరకు పలు కంపెనీలు ముందుకు వచ్చాయి.. ఇప్పటికే కొంత స్టాక్ అందుబాటులోకి తెచ్చారు. అయితే రూ.99కే నాణ్యమైన మద్యం అందిస్తే బావుంటుందని మందుబాబులు తమ ఆశని వ్యక్తం చేస్తున్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు