టెన్త్ విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ అదిరిపోయే శుభవార్త!

ఏపీ టెన్త్ విద్యార్థులకు చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఎన్‌సీఆర్టీ పుస్తకాల్లోని హిందీ పాఠాలు కష్టంగా ఉండటంతో పదవ తరగతిలో నాలుగు పాఠాలను తొలగిస్తున్నట్లు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ap2
New Update

ఆంధ్రప్రదేశ్ టెన్త్ విద్యార్థులకు చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. పదో తరగతిలో ఎన్‌సీఆర్టీ పుస్తకాల్లోని హిందీ సబ్జెట్‌లో పాఠాలను తొలగించింది.  ఏపీలో పదవ తరగతి విద్యార్థులకు ఈ ఏడాది నుంచి ఎన్‌సీఆర్టీ పుస్తకాలను ప్రవేశపెట్టారు. కేవలం తెలుగు సబ్జెట్ వదిలి అన్ని సబ్జెట్‌లను చేర్చారు. అయితే సాధారణంగానే హిందీ కష్టంగా ఉంటుందని విద్యార్థులు అంటుంటారు. సౌత్ కంటే ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా హిందీ మాట్లాడతారని ఎన్‌సీఆర్‌టీలో హిందీ పాఠాలను పెట్టారు. ఈ పాఠాలు మాతృభాష తెలుగు అయిన విద్యార్థులకు కష్టంగా ఉండటంతో నాలుగు పాఠాలను తొలగించారు. 

ఇది కూడా చూడండి:  సత్తాచాటిన తండ్రీ కొడుకులు.. కుటుంబమంతా ప్రభుత్వ ఉద్యోగులే!

నాలుగు పాఠాలను..

ఈ హిందీ పాఠాలు కేవలం విద్యార్థులకు మాత్రమే కాకుండా టీచర్లకు బోధన చేయడానికి ఇబ్బందిగా ఉందని ప్రభుత్వానికి వినతులు రావడంతో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై సమీక్ష నిర్వహించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇప్పటివరకు బోధించని పాఠాలను తొలగించారు. పద్యభాగంలో 7వ పాఠం ఆత్మత్రాణ్‌, గద్యభాగంలో 11వ పాఠం తీసరి కసంకే శిల్పాకార్‌ శైలేంద్ర్‌, 12వ పాఠం అబ్‌ కహ దౌసరోంకే దుఃఖ్‌ సే దుఃఖీ హోనేవాలే, ఉపవాచకంలో 3వ పాఠం టోపీ శుక్ల పాఠాలను తొలగించారు.

ఇది కూడా చూడండి: రూ.1కే ఆటో రైడ్.. ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్ ఎక్కడంటే?

#chandrababu #syllabus #tenth-students
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe