ఏపీ అసెంబ్లీలో మరికొన్ని కీలక బిల్లులు ఆమోదం..

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీలో ఈరోజు మరికొన్ని బిల్లులు ఆమోదం పొందాయి. ఏపీ కో-ఆపరేటివ్ సోసైటిస్ చట్ట సవరణ బిల్లు-2024, ఏపీ ఎక్సైజ్ చట్ట సవరణ బిల్లు-2024 తదితర బిల్లులకు ఆమోదం తెలిపింది.

New Update

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీలో ఈరోజు మరికొన్ని బిల్లులు ఆమోదం పొందాయి. ఏపీ కో-ఆపరేటివ్ సోసైటిస్ చట్ట సవరణ బిల్లు-2024, ఏపీ ఎక్సైజ్ చట్ట సవరణ బిల్లు-2024, ఏపీ ప్రొహిబిషన్ చట్ట సవరణ బిల్లు-2024, ఏపీ ఇండియా మెడ్‌ లిక్కర్, ఫారిన్ మెడ్ లిక్కర్ చట్ట సవరణ బిల్లు-2024ను ఆమోదించారు. ఆ తర్వాత శాసనసభ బుధవారానికి వాయిదా పడింది.

Also Read: చెత్త వేస్తే చలానా.. ఫొటో తీసి మరీ పట్టుకుంటారు.. GHMC నయా యాప్ రెడీ!

 ఇదిలాఉండగా సోమవారం ఏపీ సర్కార్‌ ఏడు బిల్లులకు శాసనసభలో ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఏపీ పంచాయతీ రాజ్‌ సవరణ బిల్లు-2024, ఏపీ ల్యాండ్ గ్రాబింగ్‌ నిరోధక బిల్లు-2024, ఏపీ మున్సిపల్ సవరణ బిల్లు-2024కు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఎంతమంది పిల్లలున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించేలా నిబంధనలు మారుస్తూ తీసుకొచ్చిన బిల్లును కూడా శాసనసభ ఆమోదించింది.

Also Read: 25 నుంచి పార్లమెంట్.. జమిలీ ఎన్నికలతో పాటు రానున్న కీలక చట్టాలివే!

అలాగే ఆయుర్వేదిక్ హోమియోపతి మెడికల్ ప్రాక్టిషనర్స్ చట్ట సవరణ, ఏపీ మెడికల్ ప్రాక్టిషనర్స్ రిజిస్ట్రేషన్‌ చట్ట సవరణ బిల్లు-2024, ఎన్టీఆర్ హెల్త్‌ యూనివర్సిటీ సవరణ బిల్లు-2024 బిల్లులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటితో పాటు ఏపీ సహకారం సంఘం సవరణ బిల్లు-2024 ను కూడా అసెంబ్లీ ఆమోదించింది.

Also Read: ఎంతకు తెగబడ్డారేంట్రా.. ఏకంగా RBI గవర్నర్ డీప్ ఫేక్ వీడియోను ఎలా చేశారో చూడండి!

Also Read: శబరిమలకు పోటెత్తిన స్వాములు..దర్శనానికి 10 గంటల సమయం!

#telugu-news #ap-assembly
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe